MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam6d366eaa-b479-49a0-9bcb-288c18879bb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam6d366eaa-b479-49a0-9bcb-288c18879bb8-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది పూజ హెగ్దే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. Radhe Shyam;prabhas;kumaar;pooja hegde;prema;shyam;vikramaditya;cinema;jil;love;industry;heroine;romantic;vemuri radhakrishnaలీకైన రాధే శ్యామ్.. సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఇదేనా..?లీకైన రాధే శ్యామ్.. సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఇదేనా..?Radhe Shyam;prabhas;kumaar;pooja hegde;prema;shyam;vikramaditya;cinema;jil;love;industry;heroine;romantic;vemuri radhakrishnaSun, 18 Apr 2021 08:26:53 GMTచిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది పూజ హెగ్దే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ఇక ఈ సినిమా దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలను ప్రభాస్ పై రీ షూట్ చేయబోతున్నారని సమాచారం. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే విక్రమాదిత్య ప్రేరణ పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

అయితే ఈ వార్త ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో పెద్ద కార్ల కంపెనీకి ఓనర్ గా కనిపించనుండగా పూజా హెగ్డే మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నారు. ఒక ప్రమాదం వల్ల సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే కలుస్తారని ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుందని తెలుస్తోంది. కథకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని సమాచారం. మరోవైపు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ వస్తున్న వార్తల వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారని సమాచారం. దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోగా రాధే శ్యామ్ వాయిదా పడుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగర్ ఉపఎన్నిక ఈవీఎంలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!

టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన జగన్ టీమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>