ViralMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/karantaka-428daa5c-7c51-41ff-9b32-ce53b720b5d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/karantaka-428daa5c-7c51-41ff-9b32-ce53b720b5d0-415x250-IndiaHerald.jpgవరుడు కావలెను అనే ప్రకటనలు ఉదయాన్నే న్యూస్ పేపర్ తెరిస్తే బోలెడు కనిపిస్తాయి. అందులో పెద్ద వింతేమీ లేదు. అయితే సాధారణంగా పాతికేళ్లు..లేదంటే ముప్పై ఏళ్ళ లోపు వారు సంబంధాల కోసం ప్రకటనలు ఇస్తుంటారు. కానీ ఇటీవల కర్ణాటకలో ఓ 73 ఏళ్ల బామ్మ వరుడు కావలెను అంటూ ఇచ్చిన ప్రకటన అందర్నీ ఆశ్చర్య పర్చింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బామ్మ ఇచ్చిన ప్రకటన పై నెగిటివ్ కామెంట్స్ తో పాటు పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి బామ్మ పెళ్లి కోరుకుంటోంది తనకు జీవితంలో ఒక తోడు కోసం మాతkarantaka;jeevitha rajaseskhar;engineer;marriage;spouse;v73 ఏళ్ల బామ్మకు వరుడు కావలెను..!73 ఏళ్ల బామ్మకు వరుడు కావలెను..!karantaka;jeevitha rajaseskhar;engineer;marriage;spouse;vSun, 18 Apr 2021 10:43:43 GMTవరుడు కావలెను అనే ప్రకటనలు ఉదయాన్నే న్యూస్ పేపర్ తెరిస్తే బోలెడు కనిపిస్తాయి. అందులో పెద్ద వింతేమీ లేదు. అయితే సాధారణంగా పాతికేళ్లు..లేదంటే ముప్పై ఏళ్ళ లోపు వారు సంబంధాల కోసం ప్రకటనలు ఇస్తుంటారు. కానీ ఇటీవల కర్ణాటకలో ఓ 73 ఏళ్ల బామ్మ వరుడు కావలెను అంటూ ఇచ్చిన ప్రకటన అందర్నీ ఆశ్చర్య పర్చింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బామ్మ ఇచ్చిన ప్రకటన పై నెగిటివ్ కామెంట్స్ తో పాటు పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి బామ్మ పెళ్లి కోరుకుంటోంది తనకు జీవితంలో ఒక తోడు కోసం మాత్రమే ప్రకటంలోనూ తను అదే స్పష్టంగా తెలిపింది. "నా వయస్సు 73 సంవత్సరాలు. నా తల్లి తండ్రులు చనిపోయారు. నా అన్నవారు ఎవరూ లేరు. కొన్ని ఇబ్బందుల వల్ల మొదటి భర్తతో విడిపోయాను. ఆ తరవాత పెళ్లి పై ఆసక్తి లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మాత్రం నాకు ఒంటరిగా జీవించాలంటే భయమేస్తోంది. నాకు జీవితంలో ఒక తోడు కావాలనిపిస్తుంది. 

అందుకోసమే జీవిత భాగస్వామి కోసం చూస్తున్నాను" అంటూ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రకటన చూడ్డానికి కొంతమందికి ఫన్నీగా అనిపించినా..మరి కొంతమందికి ఈ వయసులో పెళ్లి అవసరమా అని కోపం వచ్చినా వారి ఆలోచనా స్థాయి  అక్కడికే పరిమితం అయిందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో నా అన్న వారు లేకపోతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలిసిందే. ప్రస్తుతం కొడుకులు కూతుళ్లు ఉన్న వృద్ధ తల్లి తండ్రులను పట్టించుకునే వారు లేక అనాథాశ్రమల్లో వదిలిపెడుతున్నవారిని చూస్తూనే ఉన్నాం. ఇక తోడు లేకపోతో ఎవరూ లేని ఆ బామ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇదిలా ఉండగా బామ్మ ప్రకటన  చూసి ఓ 69 ఏళ్ల రిటైడ్ ఇంజనీర్ పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం!

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>