Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021b3a23890-33c1-461f-9bdb-cd1c38712b6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021b3a23890-33c1-461f-9bdb-cd1c38712b6b-415x250-IndiaHerald.jpg ఐపీఎల్ 14వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమనేదే లేకుండా దూసుకుపోతోంది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో రాణించి సూపర్ విక్టరీ సాధించింది. 38 పరుగుల తేడాతో కేకేఆర్‌పై విజయకేతనం..ipl 2021;venkatesh;rana;karthik;chakravarthy;rahul new;rahul;rani;sundar;varun;varun sandesh;varun tej;virat kohli;k l rahul;washington sundar;rahul sipligunj;sardar vallabhai patel;dinesh karthik;paruguబెంగళూరు రికార్డ్ విన్.. ఐపీఎల్ చరిత్రలోనే..బెంగళూరు రికార్డ్ విన్.. ఐపీఎల్ చరిత్రలోనే..ipl 2021;venkatesh;rana;karthik;chakravarthy;rahul new;rahul;rani;sundar;varun;varun sandesh;varun tej;virat kohli;k l rahul;washington sundar;rahul sipligunj;sardar vallabhai patel;dinesh karthik;paruguSun, 18 Apr 2021 20:16:20 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమనేదే లేకుండా దూసుకుపోతోంది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో రాణించి సూపర్ విక్టరీ సాధించింది. 38 పరుగుల తేడాతో కేకేఆర్‌పై విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే ఏనాడూ సాధించని ఓ రికార్డును సైతం బెంగళూరు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో బెంగళూరు ఇప్పటివరకు ఏనాడూ తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచింది లేదు. కానీ ఈ సారి ఆ ఘనత సాధించింది. అంతేకాకుండా ఈ విజయంతో ఈ సీజన్ పాయింట్ల పట్టికలో కూడా 6 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్‌ ఎంచుకుని అదరగొట్టింది. విరాట్ కోహ్లీ(5), దేవదత్ పడిక్కల్(25) ఓపెనింగ్ దెబ్బతిన్నా, కోహ్లీ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ పాటిదార్(1) కూడా వెంటనే అవుట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. మ్యాక్స్‌వెల్(78: 49 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఏబీ డివిలియర్స్(76: 34 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మైదానంలో బౌండరీల మోత మోగింది. కేకేఆర్ బౌలర్లపై మ్యాక్సీ, ఏబీడీ విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, ప్యాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణలకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు నితీశ్ రాణా(18: 11 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్(21: 9 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడడంతో మంచి ఓపెనింగ్ దక్కింది. గిల్ అవుటయ్యాక క్రీజులోకొచ్చిన రాహుల్ త్రిపాఠీ(25: 20 బంతుల్లో.. 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. కానీ పవర్ ప్లే ఆఖరి బంతికి త్రిపాఠి కూడా వికెట్ కోల్పోయాడు. దీంతో నితీశ్ రాణాతో కలిసి ఇయాన్ మోర్గాన్(29: 23 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు) నెమ్మదిగా స్కోరు బోర్డును నడిపించారు.

అయితే భారీ లక్ష్యం ముందుండడంతో వీరిపై ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తడిలోనే వీరిద్దరూ వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్(2) కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. దీంతో కేకేఆర్ కష్టాల్లో పడిపోయింది. ఆ తర్వాత షకిబ్ అల్ హసన్(26: 25 బంతుల్లో.. 1 ఫోర్ల్, 1 సిక్స్), ఆండ్రూ రస్సెల్‌(31: 20 బంతుల్లో.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి వికెట్ పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. వీళ్లిద్దరూ భారీ షాట్లకు ప్రయత్నించకపోవడంతో రిక్వైర్ట్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. బెంగళూరు బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివర్లో రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.

ఆఖరి ఓవర్లలో రస్సెల్ మూడు బౌండరీలు కొట్టినా అప్పటికే కేకేఆర్ విజయానికి పూర్తిగా దూరమైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు తీయగా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఏబీ డివిలియర్స్‌ను వరించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>