Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shankar24f4ad2d-1833-499b-a344-9c26bccb254f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shankar24f4ad2d-1833-499b-a344-9c26bccb254f-415x250-IndiaHerald.jpgదక్షిణాదిలో భారీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు శంకర్ ముందువరుసలో ఉంటారు. శంకర్ దర్శకత్వం వహించే సినిమాలకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. శంకర్ సినిమా అంటే భారీ గ్రాఫిక్స్ లు, హంగులు ఆర్భాటాలు ఓ రేంజ్ లో ఉంటాయి.సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తారు. శంకర్ ఎక్కువగా తమిళ హీరోలతోనే ఎంతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. shankar;kamal hassan;kajal aggarwal;lyca productions;shankar;cinema;telugu;tamil;remake;graphics;success;indian;kathanam;massశంకర్ లో ఇంతటి మార్పు రావడానికి కారణం ఏమిటో?శంకర్ లో ఇంతటి మార్పు రావడానికి కారణం ఏమిటో?shankar;kamal hassan;kajal aggarwal;lyca productions;shankar;cinema;telugu;tamil;remake;graphics;success;indian;kathanam;massSun, 18 Apr 2021 03:00:00 GMT
దక్షిణాదిలో భారీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు శంకర్ ముందువరుసలో ఉంటారు. శంకర్ దర్శకత్వం వహించే సినిమాలకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. శంకర్ సినిమా అంటే భారీ గ్రాఫిక్స్ లు, హంగులు ఆర్భాటాలు ఓ రేంజ్ లో ఉంటాయి.సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తారు. శంకర్ ఎక్కువగా తమిళ హీరోలతోనే ఎంతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు.


ప్రస్తుతం శంకర్ సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ జంటగా భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.శంకర్ ఏ సమయంలో ఈ సినిమా ప్రారంభించారో తెలియదు కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి.అయితే శంకర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది ఒక తమిళ సినిమా అనువాదంగా ఎవరూ అనుకోలేదు.


 తమ భాషా చిత్రమే అన్నంతగా ఆ సినిమాల కోసం ఎదురుచూశారు .. వీలైనంతవరకూ విజయాలనే ముట్టజెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని థియేటర్ల నుంచి వివిధ దేశాల్లోని స్క్రీన్లు ఆయన సినిమాల కోసం తపనపడ్డాయి  సక్సెస్ ఆయన లాన్ లో పడి ఉండటానికి కారణం సినిమాను శంకర్ ఒక తపస్సుగా భావించడం .. ఒక యజ్ఞంలా దానిని పూర్తి చేయడం. ఎంతటి స్టార్ తో పనిచేస్తున్నా ఆయనలో బెరుకుతనం కనిపించదు. అందుకు కారణం తను ఎంచుకున్న కథపై తనకి గల నమ్మకం .. కథనంపై తనకి గల పట్టు.



అయితే సాధారణంగా శంకర్ ఒక సినిమా కోసం పేపర్ పై పెన్ను పెట్టాడంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకూ మరో ప్రాజెక్టును గురించి ఆయన ఆలోచన చేయడు. అలాగే ఎంత పారితోషికం ఇస్తానని చెప్పినా ఆయన ఇతర భాషా సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తిని చూపించడు. ఆయన తమిళంలోనే చేస్తారు .. అది ఇతర భాషల్లోకి మారవలసిందే. కానీ ఈ సారి శంకర్ ఒక వైపున 'ఇండియన్ 2' సెట్స్ పై ఉండగానే తెలుగులో చరణ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు హిందీలో 'అపరిచితుడు' రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. ఇలా ఆయన ఒకేసారి రెండు పడవలపై కాళ్లు పెట్టడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి. మరి హఠాత్తుగా శంకర్ లో ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందో .. ఏమిటో?



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్ల ‌పై దిల్ రాజు ఫాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ షూటింగులు బంద్...?

గబ్బర్ సింగ్ ని మించి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా హరీష్ పవన్ సినిమాని తెరకెక్కిస్తాడట...

వకీల్ సాబ్ హిట్ అయ్యిందనే.. ఐకాన్ సెట్ చేశారా...!!!

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>