Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2ea60c95-b3e7-4cf3-b492-32ca281f93f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2ea60c95-b3e7-4cf3-b492-32ca281f93f4-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుండి ఆంధ్ర రాజకీయాలు మొత్తం తిరుపతి పార్లమెంటు స్థాన ఉప ఎన్నిక చుట్టే తిరిగాయి. ఇక అన్ని పార్టీలు తిరుపతి ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి. ముఖ్యంగా అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి. అయితే అటు అన్ని పార్టీలే కాదు అధికార పార్టీ తిరుపతి ఉప ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుJagan;view;tiru;jagan;tirupati;husband;ycp;party;mantraతిరుపతి ఉప ఎన్నిక.. జగన్ అనుకున్నదొక్కటి అయినదొక్కటి..?తిరుపతి ఉప ఎన్నిక.. జగన్ అనుకున్నదొక్కటి అయినదొక్కటి..?Jagan;view;tiru;jagan;tirupati;husband;ycp;party;mantraSun, 18 Apr 2021 10:00:00 GMTగత కొన్ని రోజుల నుండి ఆంధ్ర రాజకీయాలు మొత్తం తిరుపతి పార్లమెంటు స్థాన ఉప ఎన్నిక చుట్టే తిరిగాయి. ఇక అన్ని పార్టీలు తిరుపతి ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి. ముఖ్యంగా అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి. అయితే అటు అన్ని పార్టీలే కాదు అధికార పార్టీ తిరుపతి ఉప ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో ఈసారి కూడా తప్పనిసరిగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.



 అయితే తిరుపతి ఉప ఎన్నిక కోసం స్వయంగా పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగక పోయినప్పటికీ అటు మంత్రులకు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా తిరుపతిలో గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలని ఓటర్లు అందర్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా చర్యలు చేపట్టాలి అంటూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో రెండు లక్షలకు పైచిలుకు మెజారిటీ తో విజయం సాధించింది అధికార వైసిపి పార్టీ. ఈ క్రమంలోనే ఇక ఈసారి నాలుగు నుంచి ఐదు లక్షల మెజారిటీ సాధించాలని మంత్రులకు జగన్ కూడా టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే జగన్ ఆదేశాలకు అనుగుణంగానే తిరుపతి ఉప ఎన్నిక బాధ్యతలు చేపట్టిన మంత్రులు కీలక నేతలు అందరూ కూడా ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు.  కానీ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జగన్ అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది తిరుపతి ఉప ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ ఏడాది మాత్రం  అధికారిపార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కేవలం 64. 29 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది.  ఇంత తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో అటు జగన్ అనుకున్న విధంగా భారీ మెజారిటీ సాధించగలుగుతారా లేదా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే  మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>