HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/belly-fat-984fa38b-f9e6-4cc7-a751-fc79309c71f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/belly-fat-984fa38b-f9e6-4cc7-a751-fc79309c71f4-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే వాళ్ళ ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తదితర విషయాలు ద్వారా అబ్బాయిల అందరికి పొట్ట రావడం సహజం అయిపోయింది. ఇలా బెల్లీ ఫ్యాట్ ఉండటం వల్ల అనుకోని రోగాలు కూడా వస్తాయి. Belly Fat;heart;sugar;cheque;girl;cholesterolఈ ఐదు వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చట.!ఈ ఐదు వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చట.!Belly Fat;heart;sugar;cheque;girl;cholesterolSun, 18 Apr 2021 10:03:34 GMTనేటి సమాజంలో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే వాళ్ళ ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తదితర విషయాలు ద్వారా అబ్బాయిల అందరికి పొట్ట రావడం సహజం అయిపోయింది. ఇలా బెల్లీ ఫ్యాట్ ఉండటం వల్ల అనుకోని రోగాలు కూడా వస్తాయి. అందువల్ల అబ్బాయిలు ఏదో ఒకటి చేసైనా పొట్ట తగ్గించుకోవాలని చాలా కష్టాలు పడుతున్నారు.

అందుకు కొంతమంది జిమ్‌లకు వెళ్లి మరీ శ్రమ పడుతుంటారు. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. మనం రోజూ తినే ఆహారంలోనే కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి. పొట్ట తగ్గించడంలో భాగంగా రోజూ చేసే వ్యాయామాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. పొట్ట తగ్గించడంలో భాగంగా క్రుంచెస్ ఉత్తమమైన వ్యాయామం. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని సిఫార్సు చేస్తారు. ఈ వ్యాయామం కొవ్వు తగ్గడానికి ఉపయోగపడటమే కాకుండా యాబ్స్ రావడంలో కూడా సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా మీరు ఎలప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.

ఇక బరువు తగ్గాలంటే, వాకింగ్ ఎక్సర్‌సైజ్ తప్పనిసరిగా చేయాలి. అలాగే రోజూ అరగంట వేగంగా పరిగెత్తడం వల్ల బెల్లీ ఫ్యాట్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అటు ఈ వ్యాయామం వల్ల మీ జీవక్రియ, హార్ట్ రేటు కూడా మెరుగ్గా ఉంటుంది. పొట్ట తగ్గించడంలో భాగంగా కొంతమందికి వ్యాయామాలు చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటి వారికి జుమ్బ్ చాలా మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా, మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా.. ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్‌ను సైతం తగ్గిస్తుంది. గుండెకు సైతం మేలు చేస్తుంది.

అయితే ఉదర కొవ్వును తగ్గించడానికి సైక్లింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. సైక్లింగ్ చేయడం ద్వారా తొడల దగ్గర కొవ్వును, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించవచ్చు. ఇందుకోసం రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం చాలా అవసరం. మీరు జిమ్‌కు వెళ్లకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించాలనుకుంటే, మీరు కొన్ని ఏరోబిక్ వర్కౌట్‌లను చేయవచ్చు. ఈ వ్యాయామం క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>