MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movie-association-issuee3926d07-1407-44d4-92ce-2d253cf0d79d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movie-association-issuee3926d07-1407-44d4-92ce-2d253cf0d79d-415x250-IndiaHerald.jpgఓ వైపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత తమ అభిమాన నటుడు పవర్ స్టార్ సినిమా థియేటర్లలోకి వచ్చిందని మెగా ఫ్యాన్స్ సంబరపడుతుంటే..మరోవైపు సినీ పరిశ్రమ ప్రతినిధులు టికెట్స్ విషయంలో ఏపీ సర్కారు ఇచ్చిన షాక్ తో సతమతమవుతున్నారు. పవన్ చిత్రం వకీల్ సాబ్ ను టార్గెట్ చేసినట్లుగా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన టిక్కెట్టు ధరల జీవో సినీ రంగానికి పెద్ద సమస్యగా మారింది. TELUGU MOVIE ASSOCIATION ISSUE;pawan;pawan kalyan;andhra pradesh;industries;cinema;government;letter;cinema ticketsవివాదాస్పద జీవోపై ఏపీ ప్రభుత్వానికి విన్నపం...!వివాదాస్పద జీవోపై ఏపీ ప్రభుత్వానికి విన్నపం...!TELUGU MOVIE ASSOCIATION ISSUE;pawan;pawan kalyan;andhra pradesh;industries;cinema;government;letter;cinema ticketsSun, 18 Apr 2021 22:11:51 GMTఓ వైపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత తమ అభిమాన నటుడు పవర్ స్టార్ సినిమా థియేటర్లలోకి వచ్చిందని మెగా ఫ్యాన్స్ సంబరపడుతుంటే..మరోవైపు సినీ  పరిశ్రమ ప్రతినిధులు టికెట్స్ విషయంలో ఏపీ సర్కారు ఇచ్చిన షాక్ తో సతమతమవుతున్నారు. పవన్ చిత్రం వకీల్ సాబ్ ను  టార్గెట్ చేసినట్లుగా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన టిక్కెట్టు ధరల జీవో   సినీ రంగానికి పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతానికి వకీల్ సాబ్ చిత్రం బుక్ అయినా ...తదుపరి రిలీజ్ అయ్యే చిత్రాలపై కూడా ఈ నూతన జీవో 35 ప్రభావం పడనుంది. దీని వలన కేవలం పెద్ద సినిమాలకే కాదు చిన్న సినిమాలకు సైతం ...ఈ జీవో తలనొప్పిగా మారింది. వకీల్ సాబ్ టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతుల్ని రద్దు చేస్తూ.. ఎగ్జిబిటర్లు పంపిణీదారులకు నోటీసులు పంపింది ఏపీ ప్రభుత్వం. 

ఈ జీవో చూసి సినీ దిగ్గజాలు సైతం బాబోయ్ అంటున్నారంటే దీని ప్రబావం ఏ స్థాయిలో ఉందో  ప్రత్యేకించి చెప్పనవసరం లేదు...ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్స్  తో పాటు నిర్మాతలను సైతం ఈ జీవో కలవరపెడుతోంది. దీంతో వీరి వైపు నుండి ప్రభుత్వంపై వ్యతిరేకత తెలియజేస్తున్నారు అని చెప్పలేము కానీ..ఇది సమంజసమని కాదని... ఈ జీవో 35 తమకు జరిగే నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మరోసారి టికెట్ ధర పెంపు నిర్ణయంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఏపీ సర్కార్ కు ఈ విషయమై ఒక లేఖ రాసింది. జారీ చేసిన G.O ని తమ విజ్ఞప్తి మేరకు పునః పరిశీలించమని అభ్యర్థిస్తూ.. దీనివల్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఈ లేఖలో ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లపై పరిమితి విషయం పట్ల.. వారు గతంలో పన్నురహిత నిర్వహణ ఛార్జీలను కూడా చెల్లించి కష్టాల్ని ఎదుర్కొన్నామని తెలిపారు. అయితే ప్రస్తుత జీఎస్టీ విధానం వల్ల పన్ను రహిత వ్యవస్థ ఉనికిలో లేదు. కాబట్టి టికెట్ ధర నిర్వహణ ఛార్జీలు జీఎస్టీతో కూడిన కొత్త టికెట్ రేట్లతో కొత్త జి.ఓ.ని జారీ చేయాలని ఎగ్జిబిటర్లు ఎపి ప్రభుత్వానికి విన్నవించారు. పై విషయాలను పరిగణలోకి తీసుకొని మరోసారి టికెట్ యొక్క ధర పై ఆలోచించాలని పేర్కొన్నారు. మరి ఈ విషయం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>