Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas65e5f62b-4c40-42c9-9efc-edbf4a933e02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas65e5f62b-4c40-42c9-9efc-edbf4a933e02-415x250-IndiaHerald.jpgరాజమౌళి బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్యాన్ ఇండియా లెవెల్లో స్టార్ డమ్ లభించింది. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా నార్త్ సైడ్ సూపర్ కలెక్షన్లను సంపాదించింది. దీంతో ఇండియా రేంజ్‌లో ప్రస్తుతం ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మరిపోయాడు. అతడితో సినిమా తీసేందుకు సౌత్ నుంచి నార్త్ వరకు డైరెక్టర్లంతా క్యూ కడుతున్నారు. అతడి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ప్రభాస్‌కు టాలీవుడ్‌లో..prabhas;prabhas;anand malayalam actor;krishnam raju;rajamouli;india;korea, south;bollywood;cinema;saaho;jil;director;vegetable market;wanted;dhoom;anand deverakondaప్రభాస్ కోసం బాలీవుడ్ బడా డైరెక్టర్ల క్యూ.. వామ్మో ఇంత ఫాలోయింగా..ప్రభాస్ కోసం బాలీవుడ్ బడా డైరెక్టర్ల క్యూ.. వామ్మో ఇంత ఫాలోయింగా..prabhas;prabhas;anand malayalam actor;krishnam raju;rajamouli;india;korea, south;bollywood;cinema;saaho;jil;director;vegetable market;wanted;dhoom;anand deverakondaSun, 18 Apr 2021 15:44:21 GMTఇంటర్నెట్ డెస్క్: రాజమౌళి బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్యాన్ ఇండియా లెవెల్లో స్టార్ డమ్ లభించింది. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా నార్త్ సైడ్ సూపర్ కలెక్షన్లను సంపాదించింది. దీంతో ఇండియా రేంజ్‌లో ప్రస్తుతం ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మరిపోయాడు. అతడితో సినిమా తీసేందుకు సౌత్ నుంచి నార్త్ వరకు డైరెక్టర్లంతా క్యూ కడుతున్నారు. అతడి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ప్రభాస్‌కు టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో మార్కెట్ పెరిగిపోయింది. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ ఓం రవుత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అతడితో ప్రాజెక్ట్‌లు చేసేందుకు మరికొంత మంది డైరెక్టర్లు కూడా రెడీ అవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, సిద్దార్థ్ ఆనంద్ కూడా చేరారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలున్నాయి. అందులో ఒకటి ఆదిపురుష్ కాగా..  మరొకటి కేజీఎఫ్‌తో స్టార్ డైరెక్టర్‌గా మారిన సౌత్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండిండికంటే ముందు జిల్ ఫేమ్ రాథాకృష్ణ డైరెక్షన్‌లో రానున్న రాధేశ్యామ్ కూడా ప్యాన్ ఇండియా సినిమాగానే రానుంది. వీటితో పాటు మరో ప్యాన్ ఇండియా సినిమాకు కూడా ప్రభాస్ సైన్ చేశాడు. కాగా.. ఆదిపురుష్ షూటింగ్ దశలో ఉండగానే బాలీవుడ్ లో చాలా మంది దర్శకులు పాన్ ఇండియా కథలని సిద్ధం చేసుకొని ప్రభాస్‌‌ను సంప్రదిస్తున్నారట. ఈ క్రమంలోనే సిద్ధార్ధ ఆనంద్ ఓ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథని ప్రభాస్‌కి వినిపించాడని, దీనికి ప్రభాస్ నుంచి కూడా సానూకూల స్పందన వచ్చిందని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోందట.

ఇది మాత్రమే కాదు.. ప్రభాస్‌తో సినిమా తీయాలని సంజయ్ లీలా బన్సాలీ కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్‌లో జోరూగా రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే ధూమ్ సీరీస్ 4లో ప్రభాస్‌ని విలన్‌గా తీసుకోవాలని కూడా అనుకుంటున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, అదే జరిగితే మన టాలీవుడ్‌నుంచి బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ హీరోలను సైతం దాటేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించడం ఖాయం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజ‌ధాని రైతుల‌కు ష‌ర్మిల మ‌ద్ద‌తు??

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>