PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress632735cf-dce9-4adf-8fd4-2df66e18494b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress632735cf-dce9-4adf-8fd4-2df66e18494b-415x250-IndiaHerald.jpg గ‌త రెండు నెల‌ల క్రితం రేవంత్‌రెడ్డిని పార్టీ కొత్త‌సార‌ధిగా ఎంపిక చేశారంటూ ప్ర‌సార మాధ్య‌మాల్లో విసృత ప్ర‌చారం సాగింది. ఈ క్ర‌మంలో పార్టీలోని రేవంత్ వ్య‌తిరేఖ వ‌ర్గీయులు, ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి రేవంత్ పేరు ప్ర‌క‌టించ‌కుండా అడ్డుప‌డ్డార‌న్న చ‌ర్చ కాంగ్రెస్‌లో విస్తృతంగా సాగింది. ఈ క్ర‌మంలో అంద‌రికీ ఆమోద‌యోగ్యంగా ఉండేలా జీవ‌న్‌రెడ్డి పేరును అధిష్టానం తెర‌పైకి తెచ్చింది.telangana congress;nagarjuna akkineni;revanth;revanth reddy;y. s. rajasekhara reddy;congress;tpcc;janareddy;central government;reddy;dookudu;partyఆ ఇద్ద‌రిలో ఎవ‌రు? ‌టీపీసీసీ చీఫ్ స్థానానికి పోటీలో ఇద్ద‌రు!ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు? ‌టీపీసీసీ చీఫ్ స్థానానికి పోటీలో ఇద్ద‌రు!telangana congress;nagarjuna akkineni;revanth;revanth reddy;y. s. rajasekhara reddy;congress;tpcc;janareddy;central government;reddy;dookudu;partySun, 18 Apr 2021 10:22:00 GMTనాగార్జున సాగ‌ర్ ఉపఎన్నిక ముగిసింది. జానారెడ్డి గెలుపుపై కాంగ్రెస్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇక పార్టీ శ్రేణుల దృష్టంతా టీపీసీసీ చీఫ్ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేదానిపై కేంద్రీకృత‌మైంది. 2018 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర ఓట‌మిత‌రువాత టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్త‌మ్‌ను తొల‌గించి కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. కానీ రెండేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ నూత‌న సార‌థి పేరును ప్ర‌క‌టించ‌లేక పోయింది. ఈనెల చివ‌రినాటికి రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త‌సార‌థి పేరు ప్ర‌క‌టించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది.

టీపీసీసీ చీఫ్ స్థానానికి కేంద్ర పార్టీ పెద్ద‌లు రేవంత్ రెడ్డి, జీవ‌న్‌రెడ్డి పేర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. అయితే ఆ ఇద్ద‌రిలో ఎవ‌రైతే బాగుంటార‌న్న అంశంపై అభిప్రాయాల‌ను ఇప్ప‌టికే సేక‌రించిన అధిష్టానం ఈనెలాఖ‌రు వ‌ర‌కు ఒక‌రి పేరును ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మైంది. గ‌త రెండు నెల‌ల క్రితం రేవంత్‌రెడ్డిని పార్టీ కొత్త‌సార‌ధిగా ఎంపిక చేశారంటూ ప్ర‌సార మాధ్య‌మాల్లో విసృత ప్ర‌చారం సాగింది. ఈ క్ర‌మంలో పార్టీలోని రేవంత్ వ్య‌తిరేఖ వ‌ర్గీయులు, ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి రేవంత్ పేరు ప్ర‌క‌టించ‌కుండా అడ్డుప‌డ్డార‌న్న చ‌ర్చ కాంగ్రెస్‌లో విస్తృతంగా సాగింది. ఈ క్ర‌మంలో అంద‌రికీ ఆమోద‌యోగ్యంగా ఉండేలా జీవ‌న్‌రెడ్డి పేరును అధిష్టానం తెర‌పైకి తెచ్చింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు రావ‌టం, ప్ర‌స్తుతం నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికతో టీపీసీసీ చీఫ్ ఎంపిక నిలిచిపోయింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా వీరిద్ద‌రిలో ఎవ‌రికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే బాగుంటుంద‌నే అంశంపై కేంద్ర ‌పార్టీ పెద్ద‌లు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. వైఎస్ఆర్ కుమార్తె ష‌ర్మిల కొత్త‌పార్టీ పెడుతున్న క్ర‌మంలో.. కాంగ్రెస్‌లోని నేత‌లను ఆ పార్టీలోకి చేర్చుకొనేందుకు ష‌ర్మిల దూత‌లు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ష‌ర్మిల పార్టీలోకి కాంగ్రెస్ క్యాడ‌ర్ వెళ్ల‌కుండా చూడ‌టం పెద్ద‌స‌వాల్‌గా మారింది. మ‌రోవైపు అధికార తెరాస‌పై దూకుడుగా ముందుకెళ్ల‌డంతో పాటు..  దూసుకొస్తున్న బీజేపీని ఎదుర్కొని పార్టీని బ‌లోపేతం చేసే స‌త్తాఉన్న నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తేనే కాంగ్రెస్ పూర్వ‌వైభ‌వం వ‌స్తుంది. వీట‌న్నింటిని బేరీజు వేస్తున్న పార్టీ పెద్ద‌లు రేవంత్‌రెడ్డివైపే మొగ్గుచూపుతున్న‌ట్లు స‌మాచారం. రేవంత్‌కాని ప‌క్షంలో జీవ‌న్‌రెడ్డి పేరుఫైన‌ల్ చేస్తార‌న్న ప్ర‌చారం సాగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>