PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1906731718-f602-4581-bba8-51109107b850-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1906731718-f602-4581-bba8-51109107b850-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్నా సీఎం కేసీఆర్‌ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారుcovid19;venkat;hyderabad;india;mp;huzur nagar;assembly;letter;local language;kamareddy;sircilla;karimnagar;reddy;mancherial;party;jagtial;panjaaకరోనా కేసుల లెక్కల్లో తప్పులు!కరోనా కేసుల లెక్కల్లో తప్పులు!covid19;venkat;hyderabad;india;mp;huzur nagar;assembly;letter;local language;kamareddy;sircilla;karimnagar;reddy;mancherial;party;jagtial;panjaaSun, 18 Apr 2021 21:40:42 GMT దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత్ లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది.  తెలంగాణలో శనివారం 5 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో నమోదవుతున్న కేసులకు.. వైద్యశాఖ చెబుతున్న లెక్కలకు పొంతనే లేదంటున్నారు. జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో రోజూ ఆరు, ఏడు వందల వరకు కేసులు వస్తున్నాయని స్థానిక వైద్యాధికారుల నివేదికల్లో కనిపిస్తోంది. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న టెస్టుల లెక్క బయటికి రావడం లేదంటున్నారు.

తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్నా సీఎం కేసీఆర్‌ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు  సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎందుకు  తక్కువ చేసి చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్టులకూ టెస్టులు చేయాల్సిన సర్కార్ ఎందుకు చేయడం లేదని కోమటిరెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని.. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు.  

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఏమైందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కొవిడ్‌ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రాష్ట్ర ప్రజలందరికీ చికిత్స అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు సరిపోకపోవడంతో బాధితులు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరుతూ లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఉందని చెప్పారు. పేద ప్రజలకు కరోనా చికిత్స అందక ఇబ్బందులు పడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకపోతే కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియన్‌ 2 ఆగిపోవడానికి శంకర్ మాత్రమే కారణమా..?

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>