MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iliyana7a4d3eb9-58e1-4eb9-8070-d93ef806bcad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iliyana7a4d3eb9-58e1-4eb9-8070-d93ef806bcad-415x250-IndiaHerald.jpgఇలియానా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి డిస్కవరీ అన్నది అందరికీ తెలిసిందే. 2006 లో వచ్చిన దేవదాస్ టాలీవుడ్ లో పెద్ద సంచలనమే రేపింది. హీరో గా పోతినేని రామ్ ఫస్ట్ టైమ్ తెర మీద ఎంట్రీ ఇచ్చాడు. గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించింది. iliyana;beauty;mahesh;amar;choudary actor;ram pothineni;goa;bollywood;tollywood;cinema;industry;blockbuster hit;director;hero;silver;success;silver screen;devadas;ileana d'cruz;pokiri;mass;adhursఇల్లీ బేబీతో రామ్ మరోసారి...?ఇల్లీ బేబీతో రామ్ మరోసారి...?iliyana;beauty;mahesh;amar;choudary actor;ram pothineni;goa;bollywood;tollywood;cinema;industry;blockbuster hit;director;hero;silver;success;silver screen;devadas;ileana d'cruz;pokiri;mass;adhursSun, 18 Apr 2021 11:00:00 GMTఇలియానా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి డిస్కవరీ అన్నది అందరికీ తెలిసిందే. 2006 లో వచ్చిన దేవదాస్ టాలీవుడ్ లో పెద్ద సంచలనమే రేపింది. హీరో గా పోతినేని రామ్ ఫస్ట్ టైమ్ తెర మీద ఎంట్రీ ఇచ్చాడు. గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించింది.

సినిమా తరువాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ ఏడాదే వచ్చిన పోకిరి మూవీలో మహేష్ బాబు సరసన నటించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఇక ఇలియానా హవా కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో సాగింది. నాటి ప్రముఖ హీరోలందరి పక్కన ఆమె జత కట్టి భారీ హిట్లు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి చూసింది. అయితే అక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు.

ఈలోగా టాలీవుడ్ లో కాంపిటేషన్ పెరగడంతో మెల్లగా ఇల్లీ బేబీ క్రేజ్ తగ్గిపోయింది. ఆ మధ్యన మాస్ మహారాజా రవితేజాతో ఇలియానాను జోడీగా పెట్టి అమర్ అక్బర్ ఆంధోనీ మూవీ తీశారు. అలా  టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చినా ఆ మూవీ ఫెయిల్ కావడంతో ఇలియానాకు కలసిరాలేదు. అయితే ఇపుడు ఒక ఆసక్తికరమైన న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

ఎపుడో పదిహేనేళ్ళ క్రితం జత కట్టిన పోతినేని రామ్ ఇలియానాలు మళ్ళీ కలిపితే ఎలా ఉంటుంది అన్నదే ఆ ఆలోచన. ఈ మధ్యనే ఇలియానా రామ్ తో కలసి ఫోటోలు దిగడం తన తొలి హీరో అంటూ చెప్పుకోవడం బట్టీ చూస్తూంటే ఈ ఇద్దరూ కలసి వెండి తెర మీద కనిపించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి చిత్ర సీమలో ఎన్నో చిత్రాలు జరిగాయి. అలాంటిదే ఇపుడు ఇది కూడా జరిగినా  జరగవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇల్లీ బేబీ ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. మరి ఇలియానా కూడా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటోంది. కాబట్టి ఆమె సరైన సినిమాతో ఎంట్రీ ఇస్తే రీ ఎంట్రీ అదుర్స్ అన్నట్లుగా ఉంటుందేమో.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం!

జగన్ వల్లనే ఇదంతానా...?

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>