PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-second-wave1c1f7f66-3265-42ed-b11d-b63be22b9609-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-second-wave1c1f7f66-3265-42ed-b11d-b63be22b9609-415x250-IndiaHerald.jpgఢిల్లీలో కరోనా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆక్సిజన్ కొరత వేధిస్తోందని అందులో ప్రస్తావించారు. దాదాపు ఐసీయూ బెడ్స్ అన్నీ నిండిపోయాయని చెప్పారు. అయినా సరే, తమ ప్రయత్నంలో తాము ఉన్నామని, కేంద్రం మద్దతు కూడా కావాలాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.covid second wave;ganga;manmohan;delhi;ganges;madhya pradesh - bhopal;maharashtra - mumbai;arvind kejriwal;manmohan singh;prime minister;chief minister;job;minister;maharashtra;letter;central government;oxygen;punjab;narendraకరోనాపై చేతులెత్తేసిన ఢిల్లీ సీఎం!కరోనాపై చేతులెత్తేసిన ఢిల్లీ సీఎం!covid second wave;ganga;manmohan;delhi;ganges;madhya pradesh - bhopal;maharashtra - mumbai;arvind kejriwal;manmohan singh;prime minister;chief minister;job;minister;maharashtra;letter;central government;oxygen;punjab;narendraSun, 18 Apr 2021 18:56:45 GMTదేశంలో కరోనా విలయతాండవంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పూర్తిగా అదుపు తప్పింది. రోజూ వేలాది కొత్త కేసులు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేక చేతులెత్తేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఢిల్లీలో పరిస్థితి పూర్తిగా విషమించింది. రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. డాక్టర్లు ఏమి చేయలేకపోతున్నారు.

ఢిల్లీలో కరోనా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆక్సిజన్ కొరత వేధిస్తోందని అందులో ప్రస్తావించారు. దాదాపు ఐసీయూ బెడ్స్ అన్నీ నిండిపోయాయని చెప్పారు. అయినా సరే, తమ ప్రయత్నంలో తాము ఉన్నామని, కేంద్రం మద్దతు కూడా కావాలాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆస్పత్రుల్లో 10,000 పడకలున్నాయి. అయితే 1800 పడకలను కోవిడ్ కోసమే రిజర్వ్ చేసి ఉంచాం. ఢిల్లీలో కరోనా ఘోరంగా ఉంది. అందుకే కరోనా కోసం 7000 పడకలను రిజర్వ్ చేయాలి. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఢిల్లీలోని డీఆర్డీవోలో ఐసీయూకు సంబంధించి 500 బెడ్లను తయారు చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. అయితే మరో 500 పడకలను కూడా తయారు చేయిస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకూ మాకు కేంద్ర సహకారం పూర్తిగా అందుతోంది. మరిన్ని విషయాలపై కూడా మీరు మాకు సహాయం చేయాలని ఆశిస్తున్నాం’’ అంటూ ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు.

మరోవైపు కరోనాతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండటంపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కొన్ని సలహాలు ఇచ్చారు మన్మోహన్ సింగ్. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. రాబోయే ఆరు నెలల్లో టీకాలు ఎందరికి ఇవ్వాలో నిర్దేశించుకుని, అందుకు తగినట్లుగా టీకా తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. వివిధ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్లకు ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్డర్ల వివరాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>