MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroins50b37fa3-857a-4001-ae3b-7a17fddd156e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroins50b37fa3-857a-4001-ae3b-7a17fddd156e-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక కరోనా కారణంగా టాలీవుడ్ లో పరిస్థితులు అన్ని తలకిందులైయ్యాయి. ఇక నిర్మాతలకు కోట్లలో నష్టాలు వచ్చేసాయి. ఇండస్ట్రీ కూడా దాదాపు 2 వేల కోట్లకు పైగానే నష్టపోయింది. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్నాళ్లు టైమ్ పడుతుంది.heroins;prabhas;pooja hegde;akhil akkineni;nayantara;samantha;tollywood;tamil;love;industry;virata parvam 1992;heroine;wanted;sai pallavi;love storyకరోనా ఎఫెక్ట్: స్టార్ హీరోయిన్ల పారితోషికంలో కోత ఎంతో తెలుసా..?కరోనా ఎఫెక్ట్: స్టార్ హీరోయిన్ల పారితోషికంలో కోత ఎంతో తెలుసా..?heroins;prabhas;pooja hegde;akhil akkineni;nayantara;samantha;tollywood;tamil;love;industry;virata parvam 1992;heroine;wanted;sai pallavi;love storySat, 17 Apr 2021 11:00:00 GMTదేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక కరోనా కారణంగా టాలీవుడ్ లో పరిస్థితులు అన్ని తలకిందులైయ్యాయి. ఇక నిర్మాతలకు కోట్లలో నష్టాలు వచ్చేసాయి. ఇండస్ట్రీ కూడా దాదాపు 2 వేల కోట్లకు పైగానే నష్టపోయింది. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్నాళ్లు టైమ్ పడుతుంది. అప్పటి వరకు రెమ్యునరేషన్స్ విషయంలో కూడా కోత తప్పదు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే మరో అనుమానం లేకుండా పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈమె పారితోషికం కూడా 2 కోట్లకు పైమాటే. ఇక పారితోషికం విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. ప్రభాస్ రాధే శ్యామ్‌తో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తుంది పూజా. ఇకపై ఒప్పుకోబోయే సినిమాల కోసం హీరోలను బట్టి పారితోషికం తీసుకుంటుంది పూజా.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా తన పారితోషికంలో స్వచ్ఛందంగా కోత పెట్టుకుందని తెలుస్తుంది. విరాట పర్వంతో పాటు లవ్ స్టోరీ సినిమాల కోసం తను తీసుకునే దానికంటే కూడా తక్కువగానే అందుకుంటుంది ఈమె. ఇక సమంత ఇప్పుడు కూడా సినిమాకు 2 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు సమంత. ఒకవేళ ఒప్పుకున్నా కూడా రెమ్యునరేషన్ కట్ చేసుకోడానికి సిద్ధంగానే ఉంది. పైగా డిజిటల్ మీడియాలో తన సత్తా చూపిస్తుంది సమంత.

స్టార్ హీరోయిన్ నయనతార రేంజ్ కూడా ఇప్పుడు భారీగానే పడిపోయింది. ఒకప్పుడు వరస సినిమాలు చేసి దాదాపు 3 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసిన ఈమె. కరోనా ప్రభావంతో చాలా వరకు తన రేటులో రిబేటు ఇచ్చిందని తమిళ చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. ఉప్పెన సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. రెండో సినిమాకు 30 లక్షల వరకు తీసుకుంటుంది. కరోనా కారణంగా 30 నుంచి 40 లక్షల వరకు మాత్రమే అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లోకేష్‌ను మెచ్చుకున్న సాక్షి మీడియా!

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>