HealthThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virusdc5a0fef-a505-4cef-b686-22a727ea4acb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virusdc5a0fef-a505-4cef-b686-22a727ea4acb-415x250-IndiaHerald.jpgగ‌డిచిన 15రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింద‌ని శ్రీ‌నివాస్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా వైర‌స్ గాలిద్వారా వ్యాపించే ద‌శ‌కు చేరింద‌ని, దీంతో వైర‌స్ సోకిన బాధితుడిని గుర్తించేలోపు కుటుంబ‌మంతా వైర‌స్ బారిన ప‌డుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు.corona virus;mandula;telangana;corporateక‌రోనా ఉధృతి పెరిగింది.. అప్ర‌మ‌త్తంగా ఉండండిక‌రోనా ఉధృతి పెరిగింది.. అప్ర‌మ‌త్తంగా ఉండండిcorona virus;mandula;telangana;corporateSat, 17 Apr 2021 16:06:06 GMTక‌రోనా వైర‌స్ సెకండ్‌వేవ్ ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైర‌స్ భారిన ప‌డుతున్న‌వారి సంఖ్య ఎక్కువ‌వుతుంది. ప్ర‌జ‌లంతా క‌రోనా నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాలి, అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ తెలంగాణ ప్ర‌జారోగ్య శాఖ సంచాల‌కులు డా. శ్రీ‌నివాస్ తెలిపారు. దేశ‌వ్యాప్తంగానే కాక రాష్ట్రంలోనూ క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని, దాని ఉధృతి ఊహించ‌ని రీతిలో పెరుగుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా తొలిద‌శ నుంచి ప్ర‌జ‌లు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేద‌న్న ఆయ‌న‌.. కొవిడ్ వెళ్లిపోయింద‌నే భ్ర‌మ‌లోనే ఉన్నార‌ని, ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్యంతో సెకండ్‌వేవ్ వైర‌స్ మ‌రింత బ‌లం పుంజుకొని మ్యూటేష‌న్లుగా ఏర్ప‌డి మ‌రింత వేగంగా విస్త‌రిస్తుంద‌ని తెలిపారు.

గ‌డిచిన 15రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింద‌ని శ్రీ‌నివాస్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా వైర‌స్ గాలిద్వారా వ్యాపించే ద‌శ‌కు చేరింద‌ని, దీంతో వైర‌స్ సోకిన బాధితుడిని గుర్తించేలోపు కుటుంబ‌మంతా వైర‌స్ బారిన ప‌డుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. మ‌రోవైపు రాష్ట్రంలో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్‌ల కొర‌త ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని, అలాంటిదేమీ లేద‌ని శ్రీ‌నివాస్ తెలిపారు.

రాష్ట్రంలో మందులు, ప‌డ‌క‌లు, ఆక్సిజ‌న్ కొరత లేద‌ని, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఐదువేల ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్ర‌త్యేక కొవిడ్ ఆస్ప‌త్రులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో 116 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కొవిడ్ చికిత్స‌లు అందిస్తున్నామ‌ని, 15 నుంచి 20 కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లోనే బెడ్స్ కొర‌త ఉంద‌ని శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. జీహెచ్ ఎంసీలో ఐదు కొవిడ్ ప్ర‌త్యేక ఆస్ప‌త్రులు ఉన్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న.. పాజిటివ్ వ‌చ్చిన వారిలో 80శాతం మంది క‌రోనా బాధితుల్లో ల‌క్ష‌ణాలు ఉండ‌టం లేద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంతా క‌రోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని తెలంగాణ ప్ర‌జారోగ్య శాఖ సంచాల‌కులు డా. శ్రీ‌నివాస్ సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ ను ఖరారు చేసిన శంకర్..!!

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>