MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6368b691-9994-4279-a1e5-80487c2061be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6368b691-9994-4279-a1e5-80487c2061be-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో భాషా బేధాలు లేకుండా ఏ సినిమా హిట్ అయినా సరే ఆ సినిమాను ఇతర భాషల వాళ్ళు రీమేక్ చేసుకుంటున్నారు. అయితే నేరుగా డబ్బులు చెల్లించి రీమేక్ చేసుకుంటున్న వాళ్లు కొంతమంది అయితే ఫ్రీ మేక్ అనే పేరుతో ఈ కథను తీసుకుని తమ తమ నేటివిటీలకు తగట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్న వారు మరికొందరు. ప్రస్తుతానికి టాలీవుడ్ మాత్రం ఎక్కువగా మలయాళ సినిమాల మీద ఆసక్తి చూపిస్తోంది. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు మన స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం..tollywood gossips;pawan;chiranjeevi;venkatesh;priya;kalyan;pawan kalyan;priya prakash varrier;suma;suma kanakala;sumanth;teja;variar;tollywood;cinema;telugu;remake;heroine;amarnath k menonతెలుగులోకి రెండు మళయాళ రీమేక్స్, కానీ పేర్లు చెప్పట్లేదే ?తెలుగులోకి రెండు మళయాళ రీమేక్స్, కానీ పేర్లు చెప్పట్లేదే ?tollywood gossips;pawan;chiranjeevi;venkatesh;priya;kalyan;pawan kalyan;priya prakash varrier;suma;suma kanakala;sumanth;teja;variar;tollywood;cinema;telugu;remake;heroine;amarnath k menonSat, 17 Apr 2021 12:00:00 GMTఈ మధ్య కాలంలో భాషా బేధాలు లేకుండా ఏ సినిమా హిట్ అయినా సరే ఆ సినిమాను ఇతర భాషల వాళ్ళు రీమేక్ చేసుకుంటున్నారు. అయితే నేరుగా డబ్బులు చెల్లించి రీమేక్ చేసుకుంటున్న వాళ్లు కొంతమంది అయితే ఫ్రీ మేక్ అనే పేరుతో ఈ కథను తీసుకుని తమ తమ నేటివిటీలకు తగట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్న వారు మరికొందరు. ప్రస్తుతానికి టాలీవుడ్ మాత్రం ఎక్కువగా మలయాళ సినిమాల మీద ఆసక్తి చూపిస్తోంది. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు మన స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.. 

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు మలయాళంలో సూపర్ హిట్ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇలా కొన్ని సినిమాల్లో అఫీషియల్ రీమేక్ అవుతుంటే కొన్ని సినిమాలు మాత్రం ఫలానా మలయాళ సినిమాకు రీమేక్ అని ఎక్కడా ప్రకటించకుండా నేరుగా తెరకెక్కుతుండడం ఆసక్తికరంగా మారింది. ఆ సినిమాలు ఏవి అనగా ప్రస్తుతం సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రౌడీ, తేజ సజ్జా హీరోగా ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఇష్క్  సినిమాలు. సుమంత్ అనగనగా ఒక రౌడీ సినిమా మలయాళంలో బిజూ మీనన్ హీరోగా నటించిన పడయొట్టం కు రీమేక్ అట. 

నిజానికి సినిమా లాంచ్ చేసే సమయంలో ఇది మలయాళ సినిమాకి రీమేక్ అని పేర్కొన్నారు, అయితే  అది ఏ మలయాళ సినిమా అనేది మెన్షన్ చేయలేదు. అలాగే తేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఇష్క్ సినిమాకి తెలుగు రీమేక్. ఈ సినిమా గురించి కూడా ఎక్కడా మెన్షన్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో ఎమ్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చాలా చిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో తెరకెక్కిస్తున్నారు కానీ కానీ ఫలానా సినిమా అని ఎక్కడా మెన్షన్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపి, తెలంగాణలో టెన్షన్.. టెన్షన్.. కొనసాగుతున్న పోలింగ్..

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>