PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaae203f67-6b51-4be7-94a8-17188e75eddf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaae203f67-6b51-4be7-94a8-17188e75eddf-415x250-IndiaHerald.jpgడబుల్ మ్యూటేషన్ కరోనా రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌కు ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో రెండు మ్యూటేషన్ల(మార్పులు)తో ఏర్పడిన కొత్త రకం కరోనాతోనే అత్యధిక వ్యాప్తి జరుగుతుందని హెల్త్ ఆఫీసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహరాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ డబుల్ మ్యూటేషన్ వేవ్ ఎక్కువగా కొనసాగుతుండగా, మన రాష్ట్రంలోనూ ఇలాంటి కేసులు 50 శాతం ఉన్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ ఆఫీసర్ తెలిపారు. అంతేగాక మరో 18 నుంచి 20 శాతం యూకేcorona;health;delhi;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;telangana;mohandas karamchand gandhi;karnataka 1;oxygenతెలంగాణ‌లో క‌రోనా డ‌బుల్ మ్యూటేష‌న్‌...వైర‌స్ ఎక్కువ వ్యాప్తి అందుకేతెలంగాణ‌లో క‌రోనా డ‌బుల్ మ్యూటేష‌న్‌...వైర‌స్ ఎక్కువ వ్యాప్తి అందుకేcorona;health;delhi;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;telangana;mohandas karamchand gandhi;karnataka 1;oxygenSat, 17 Apr 2021 09:30:00 GMTడబుల్ మ్యూటేషన్ కరోనా రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌కు ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో రెండు మ్యూటేషన్ల(మార్పులు)తో ఏర్పడిన కొత్త రకం కరోనాతోనే అత్యధిక వ్యాప్తి జరుగుతుందని హెల్త్ ఆఫీసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహరాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ డబుల్ మ్యూటేషన్ వేవ్ ఎక్కువగా కొనసాగుతుండగా, మన రాష్ట్రంలోనూ ఇలాంటి కేసులు 50 శాతం ఉన్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ ఆఫీసర్ తెలిపారు. అంతేగాక మరో 18 నుంచి 20 శాతం యూకే స్ట్రెయిన్ కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఈ తాజా పరిణామంతోనే తెలంగాణ‌ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తితోపాటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.


రాబోయే రోజుల్లో కూడా మరింత భారీ స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోది.   ప్ర‌జ‌లు ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్న ప్రాణాల మీద‌కు వ‌స్తుంద‌ని, స్వీయనియంత్రణే శ్రీరామ రక్షని వైద్యాధికారులు సూచిస్తున్నారు.  వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే పేషెంట్లు క్రిటికల్ స్టేజ్‌కి వెళ్లడం గమనార్హం. మ్యూటేషన్ వైరస్‌కు ప్రస్తుతం ఉన్న మెడిసిన్ ప్రోటోకాల్ పెద్దగా పనిచేయకపోవడమే దీనికి కారణమని అధికారులు అప్ ది రికార్డులో చెబుతున్నారు. అలాంటి వారికి లక్షణాలు బట్టి మెడిసిన్స్ ఇస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.మరోవైపు గతంలో కొవిడ్ సోకిన సెకండ్ వీక్‌లో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండగా ప్రస్తుతం మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.


ఇదిలా ఉండ‌గా  హైద‌రాబాద్ గాంధీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సేవలను నిలిపి వేసిన విష‌యం తెలిసిందే. గాంధీ ఆస్పత్రిని నేటి నుంచి పూర్తిస్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. గాంధీ ఆస్పత్రిలో 450మందికి పైగా పేషంట్స్ చికిత్స పొందుతున్నారు. ఇక, ప్రతి పది నిమిషాలకు ఒకరు గాంధీ హాస్పిటల్ లో చేరుతున్నారు. నిన్న ఒక్క రోజే 150మంది కరోనా పేషంట్లు చేరారు. కోవిడ్ పేషంట్లతో గాంధీ హాస్పిటల్ ఐపీ బ్లాక్ నిండిపోయింది. దాంతో, గాంధీలో ఎమర్జెన్సీ సేవలను నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>