PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-20218d339700-a208-49c1-99af-bd1219452ab5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-20218d339700-a208-49c1-99af-bd1219452ab5-415x250-IndiaHerald.jpgఏ ఎన్నిక అయినా జనాల మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజలు స్పందించి ముందుకు రావాలి. పోలింగు బూతుల ముందు జనాలు సందడి చేస్తేనే ఎన్నికకు అర్ధం పరమార్ధం ఉంటాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఉప ఎన్నికలకూ మధ్య పెద్ద తేడా ఉంటుంది. elections-2021;tiru;bharatiya janata party;tirupati;husband;local language;ycpపోలింగ్ డల్...ఆశలు ఢమాల్...?పోలింగ్ డల్...ఆశలు ఢమాల్...?elections-2021;tiru;bharatiya janata party;tirupati;husband;local language;ycpSat, 17 Apr 2021 14:39:40 GMTఏ ఎన్నిక అయినా జనాల మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజలు స్పందించి ముందుకు రావాలి. పోలింగు బూతుల ముందు జనాలు సందడి చేస్తేనే ఎన్నికకు అర్ధం పరమార్ధం ఉంటాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఉప ఎన్నికలకూ మధ్య పెద్ద తేడా ఉంటుంది.

పైగా ఫలితాలు కొన్ని ముందుగానే తేలిపోతాయి. దాంతో ఆ ఎన్నికల మీద జనాలకు అసలు ఆసక్తి ఉండదు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా ఇదే జరుగుతోంది అని చెప్పాలేమో.  తిరుపతి ఉప ఎన్నికలో పోలింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు చాలా తాపీగా వస్తున్నారు. పోలింగు కేంద్రాలు పెద్దగా కళకళలాడడం లేదు. ఎందుకంటే దానికి బోలేడు కారణాలు. ముందే చెప్పుకున్నట్లుగా ఉప ఎన్నిక మీద ఎవరికీ  పెద్దగా ఆసక్తి లేదు. దానికి తోడు బయట కరోనా,  పైన నెత్తిన  మండించే ఎండ దీంతో పోలింగ్ బూతుల దాకా వచ్చి ఓటెందుకు వేయాలి అన్న బాపతే ఎక్కువగా ఉంది.

ఇక తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలను ప్రభావితం చేసే సీరియస్ అంశాలు ఏవీ లేవు. వారిని వీరు వీరిని వారు నిందించుకోవడం తప్ప మరేమీ ప్రచారం లో కనిపించలేదు. వీటికంటే ముందు లోకల్ బాడీ ఎన్నికల్లో జనాలు ఓటేశారు. ఇపుడు మళ్ళీ ఎన్నికలు అంటే చాలా మందికి అదోలా ఉంది. దాంతో ఈ ఎన్నికల వల్ల ఏమీ జరిగేది ఏముంది, ఒరిగేది ఏముంది అనే జనాలు పోలింగు బూతుల వద్ద కనిపించలేదు అంటున్నారు.

మొత్తానికి చూసుకుంటే గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ 79 శాతానికి పైగా జరిగింది ఉప ఎన్నిక కాబట్టి అది బాగా తగ్గుతుంది అంటున్నారు. మధాహ్యానికి అందిన సమాచారం చూస్తే ఒంటి గంట దాకా దాదాపుగా 37 శాతం పోలింగ్ జరిగింది అంటే ఈసారి డెబ్బైకి అయినా పోలింగ్ రీచ్ అవుతుందా అన్నదే డౌట్. అదే కనుక జరిగితే వైసీపీ భారీ మెజారిటీ ఆశలు ఢమాలే. అలాగే టీడీపీకి భారీ ఓట్లు, బీజేపీ టార్గెట్లు అన్నీ కూడా గోల్ మాల్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'మినీ కధ'కి కాన్ఫిడెన్సా ? ఓవర్ కాన్ఫిడెన్సా ?

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?

ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?

నీటినే ఆయుధంగా మార్చుకుంటున్న చైనా.. ఏం జరుగుతుందో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>