PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/votedc26fc5f-e656-4824-be9b-d8c448282a35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/votedc26fc5f-e656-4824-be9b-d8c448282a35-415x250-IndiaHerald.jpgప‌శ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. శనివారం 45 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 342 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశ పోలింగ్లో అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఈసారి అదనపు బలగాలను మోహరించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొంది. 5,789 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయvote;bharatiya janata party;west bengal - kolkata;congress;police;central government;election commissionతృణ‌మూల్‌కు ప‌ట్టున్న స్థాన‌ల్లో నేడు పోలింగ్‌.. ఎలా సాగుతోందంటే..?తృణ‌మూల్‌కు ప‌ట్టున్న స్థాన‌ల్లో నేడు పోలింగ్‌.. ఎలా సాగుతోందంటే..?vote;bharatiya janata party;west bengal - kolkata;congress;police;central government;election commissionSat, 17 Apr 2021 08:17:50 GMTప‌శ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. శనివారం 45 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 342 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశ పోలింగ్లో అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఈసారి అదనపు బలగాలను మోహరించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొంది. 5,789 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఓటింగ్‌ జరగనుంది.


తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ, పట్టు సాధించాలని బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రచారంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార సమయంలో తీవ్ర ఘర్షణలూ చెలరేగాయి.
బెంగాల్ ఐదో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. కూచ్‌బిహార్‌ కాల్పుల ఘటన నేపథ్యంలో 48 గంటలకు బదులు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపి వేసింది. నాలుగో విడతలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు చనిపోవటంతో ఈసీ అప్రమత్తమైంది. పోలింగ్‌ జరిగే 45 నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర పోలీసులతోపాటు 853 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది.


బంగాల్ లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో 159 స్థానాలకు ఏప్రిల్ 17- 29 మధ్యలో పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు. పోలింగ్ జరగనున్న 45 నియోజకవర్గాలు ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పోలింగ్ లో పాల్గొనబోయే ఓటర్లు 1.12 కోట్లు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 15,789. 319 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థినుల సంఖ్య 39.కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో వెస్ట్‌ బెంగాల్‌ పోలింగ్‌ సందర్భంగా అధికారులు అన్ని చర్యలను పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే డార్జిలింగ్‌లోని 263 నెంబర్ పోలింగ్ బూత్‌ వద్ద కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నఅధికారులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆకాశ‌వీధిలో క‌ల‌సిన తార‌... చిత్ర‌సీమ‌పై చెర‌గ‌ని ముద్ర‌వేసిన వివేక్‌...

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>