ఎన్నిక‌ల‌ను అప‌హాస్యం చేసిన వైకాపా : ‌కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన

తిరుప‌తి ఉప‌ ఎన్నిక‌ల‌ను అప‌హాస్యం చేసింద‌ని విమ‌ర్శించారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిందని అన్నారు. పోలింగ్‌లో జరిగిన ఘటనల వీడియోలను ఎన్నికల సంఘం ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. నకిలీ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల దగ్గర తిరగడం.. బస్సుల్లో నకిలీ ఓటర్లను తరలించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఘాటుగా స్పందించారు. తిరుపతి ఉపఎన్నికకు వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓటర్లను పట్టించిన టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.