PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-202179d329e6-dbe7-4dcb-9c94-01446e4cb049-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-202179d329e6-dbe7-4dcb-9c94-01446e4cb049-415x250-IndiaHerald.jpgతిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి ఉపఎన్నికలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా, టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి పోటీలో నిలిచారు. అయితే తిరుపతి పోలింగ్‌ లో పెద్ద దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లిఖితపూర్వకంగా అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. elections-2021;jeevitha rajaseskhar;lakshmi;prasad;ramakrishna;tiru;bharatiya janata party;karnataka - bengaluru;janasena;mp;district;smart phone;police;tirupati;bus;minister;press;husband;thief;tdp;central government;ycp;janasena party;reddy;donga;panabaka lakshmiదొంగ ఓట్ల ఆరోపణలు.. ఆత్మరక్షణలో పడిన వైసీపీ !దొంగ ఓట్ల ఆరోపణలు.. ఆత్మరక్షణలో పడిన వైసీపీ !elections-2021;jeevitha rajaseskhar;lakshmi;prasad;ramakrishna;tiru;bharatiya janata party;karnataka - bengaluru;janasena;mp;district;smart phone;police;tirupati;bus;minister;press;husband;thief;tdp;central government;ycp;janasena party;reddy;donga;panabaka lakshmiSat, 17 Apr 2021 16:00:00 GMTతిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి ఉపఎన్నికలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా, టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి పోటీలో నిలిచారు. అయితే తిరుపతి పోలింగ్‌ లో పెద్ద దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి లిఖితపూర్వకంగా అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. 

టీడీపీ గెలుస్తుందన్న భయంతోనే వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి జిల్లా నలువైపుల నుంచి దొంగ ఓట్లు వేయడానికి తీసుకొచ్చారని, నకిలీ ఓటరు కార్డులు ముద్రిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఈసీకి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని పనబాక లక్ష్మి చెప్పారు. ఇక ఈ అంశం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక, ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం ఉందని అన్నారు. గతంతో పోల్చితే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ  పోలింగ్ జరుగలేదన్న ఆయన తిరుపతిలో చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారని అన్నారు.

 చంద్రబాబు కుట్ర పూరితంగా ఆలోచించటానికి అలవాటు పడ్డాడని, దొంగ ఓట్లు వేసేటట్లు అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు వేయరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు తిరుపతినే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? తిరుపతికి రోజూ లక్ష మంది వరకు భక్తులు, పర్యాటకులు వస్తుంటారు, అర్బన్ ప్రాంతంలో బస్సులు పెట్టి ఎవరైనా ఓటర్లు కాని వాళ్ళను తరలించగలుగుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో జరుగుతున్నాయన్న ఆయన కేంద్ర బలగాలు, పర్యవేక్షకులు, వెబ్ కామ్ మానిటరింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. హేయమైన, దుర్మార్గమైన చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని విమర్శించారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...

రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్..!

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక అసలు జీవితం ఏంటో తెలిసింది..!!

బాబాయ్ కోసం చరణ్ ఏం చేశారో తెలుసా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>