PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/khammam-corporation1e710472-df94-4985-9f2a-f0ca813a79d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/khammam-corporation1e710472-df94-4985-9f2a-f0ca813a79d8-415x250-IndiaHerald.jpgఖ‌మ్మం తెరాస‌లో పువ్వాడ‌, తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గాలు ఉన్న విష‌యం విధిత‌మే. ఆయా వ‌ర్గాలకు చెందిన‌వారు సిట్టింగ్ కార్పొరేట‌ర్లుగా ఉన్నారు. వారిలో చాలా మందికి ప్ర‌స్తుతం టికెట్ ల‌భించ‌ద‌నే చ‌ర్చ సాగుతుంది. ఇప్ప‌టికే పార్టీకి అందిన ఇంటిలిజెన్స్ నివేదిక ఆధారంగా 20మందికిపైగా సిట్టింగ్ కార్పొరేట‌ర్ల‌కు టికెట్లు ద‌క్కే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. khammam corporation;ktr;kumaar;bharatiya janata party;telangana rashtra samithi trs;district;minister;partyఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?ఖ‌మ్మం తెరాస‌లో టికెట్లలొల్లి.. ఎవ‌రిది పైచేయి అవుతుందో?khammam corporation;ktr;kumaar;bharatiya janata party;telangana rashtra samithi trs;district;minister;partySat, 17 Apr 2021 13:05:19 GMTకార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఖ‌మ్మం తెరాస పార్టీలో నేత‌ల మ‌ధ్య మ‌రోసారి  అగ్గి రాజేయ‌బోతున్నాయా.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. కార్పొరేష‌న్‌లో మొత్తం 60 డివిజ‌న్‌ల‌కు ఈనెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 18తో నామినేష‌న్‌ల దాఖ‌లు స‌మ‌యం ముగిసిపోనుంది. ఈ క్ర‌మంలో ఆయా డివిజ‌న్‌ల నుంచి తెరాస పార్టీ బీఫాంలు ద‌క్కించుకొనేందుకు ఆశావ‌హులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఇప్ప‌టికే అభ్య‌ర్థుల జాబితాను సిద్ధంచేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో అధికంగా మంత్రి పువ్వాడ వ‌ర్గీయుల‌కే ప్రాధాన్య‌త ల‌భించిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీంతో తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గీయుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది.

ఖ‌మ్మం తెరాస‌లో పువ్వాడ‌, తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గాలు ఉన్న విష‌యం విధిత‌మే. ఆయా వ‌ర్గాలకు చెందిన‌వారు సిట్టింగ్ కార్పొరేట‌ర్లుగా ఉన్నారు. వారిలో చాలా మందికి ప్ర‌స్తుతం టికెట్ ల‌భించ‌ద‌నే చ‌ర్చ సాగుతుంది. ఇప్ప‌టికే పార్టీకి అందిన ఇంటిలిజెన్స్ నివేదిక ఆధారంగా 20మందికిపైగా సిట్టింగ్ కార్పొరేట‌ర్ల‌కు టికెట్లు ద‌క్కే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. అయితే జిల్లా మంత్రిగా ఉన్న పువ్వాడ అజ‌య్ కుమార్‌కే కార్పొరేష‌న్ గెలుపు బాధ్య‌త‌ల‌ను అధిష్టానం అప్ప‌గించింది. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యం మొత్తం పువ్వాడనే చూస్తున్నారు. ఈ క్ర‌మంలో పొంగులేటి, తుమ్మ‌ల వ‌ర్గీయుల‌కు టికెట్లు నిరాక‌రిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తెరాస సీపీఐతో క‌లిసి పోటీచేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గీయులు సిట్టింగ్‌లుగా ఉన్న డివిజ‌న్ల‌లోనే సీపీఐకి కేటాయించేందుకు పువ్వాడ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

టికెట్ల కేటాయింపు విష‌యంలో ఇప్ప‌టికే పొంగులేటి, తుమ్మ‌ల అధిష్టానంకు కొన్ని పేర్ల‌ను ప్ర‌తిపాదించినట్లు స‌మాచారం. టికెట్ల కేటాయింపులో తాము సూచించిన వారికిసైతం ప్రాధాన్య‌త‌నిచ్చేలా చూడాల‌ని వారు విడివిడిగా కేటీఆర్‌కు వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ గెలుపోట‌ముల బాధ్య‌త‌లు మొత్తం పువ్వాడ అజ‌య్ భుజానికెత్తుకోవ‌టంతో ఒక‌వేళ కేటీఆర్ నుంచి తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గీయుల పేర్లు వ‌చ్చినా పువ్వాడ ఒప్పుకుంటారా అనేది సంశ‌యంగా మారింది. ఈ క్ర్ర‌మంలో తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గీయులుగా ఉన్న‌వారు తెరాస బీఫాంలు ద‌క్కుతాయోలేదోన‌న్న ఆందోళ‌నలో ఉన్న‌ట్లు స‌మాచారం. తెరాస‌లో టికెట్ల వ్య‌వ‌హారాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్న బీజేపీ.. తెరాస‌లో అసంతృప్తుల‌ను త‌మ‌వైపుకు లాక్కొని బ‌రిలోకి దింపేందుకు సిద్ధంగా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిన తీహార్ ఖైదీలు...

నీటినే ఆయుధంగా మార్చుకుంటున్న చైనా.. ఏం జరుగుతుందో..?

తిరుప‌తి పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌.. ఎందుకంటే??

దానికి ససేమిరా అంటున్న జగన్...?

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం...ఇది ప్రజాస్వామ్యమా...?

మద్యం సేవిస్తే కరోనా రాదట .. అవునా?

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>