Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/zoom-meeting-lo-mayam-ayina-vyakthi-aslu-matter-emitante747f5bf4-9c67-4188-9436-c5cf4574383d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/zoom-meeting-lo-mayam-ayina-vyakthi-aslu-matter-emitante747f5bf4-9c67-4188-9436-c5cf4574383d-415x250-IndiaHerald.jpgజూమ్ మీటింగ్‌లో మాయమైన వ్యక్తి.. అసలు ఏం జరిగిందంటే..! దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇక వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇందుకు గూగుల్ జూమ్‌తో పాటూ మైక్రోసాఫ్ట్ సహా కొన్ని కంపెనీలు వర్చువల్ మీటింగ్ యాప్స్ అందుబాటులోకి తెచ్చాయి. ఇక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు పిల్లలు రావడం, పిల్లులు రావడం, ఇంట్లో వాళ్లు అటూ ఇటూ వెళ్తూ.. మీటింగ్‌కి ఇబ్బంది కలిగించడం వంటివి జరుగుతున్నాయి. ఒక్కోసారి అలాంటివి ఫన్ కూడాZoom meeting;view;microsoft;google;media;house;coronavirusజూమ్ మీటింగ్‌లో మాయమైన వ్యక్తి.. అసలు ఏం జరిగిందంటే..!జూమ్ మీటింగ్‌లో మాయమైన వ్యక్తి.. అసలు ఏం జరిగిందంటే..!Zoom meeting;view;microsoft;google;media;house;coronavirusSat, 17 Apr 2021 17:15:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇక వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇందుకు గూగుల్ జూమ్‌తో పాటూ మైక్రోసాఫ్ట్ సహా కొన్ని కంపెనీలు వర్చువల్ మీటింగ్ యాప్స్ అందుబాటులోకి తెచ్చాయి. ఇక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు పిల్లలు రావడం, పిల్లులు రావడం, ఇంట్లో వాళ్లు అటూ ఇటూ వెళ్తూ.. మీటింగ్‌కి ఇబ్బంది కలిగించడం వంటివి జరుగుతున్నాయి. ఒక్కోసారి అలాంటివి ఫన్ కూడా క్రియేట్ చేస్తున్నాయి.

ఇక తాజాగా అలాంటి ఓ ఘటన జూమ్ కాల్‌లో కలకలం రేపింది. టిక్ టాక్‌లో టైలర్డ్ బిట్స్ అనే పేరుతో ఉన్న అకౌంట్‌లో ఈ వీడియో ఉంది. దీన్ని మరిన్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా షేర్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి గ్రీన్ మార్ఫ్ సూట్ వాడాడు. ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అవ్వాలనే ఉద్దేశంతో ఆ సూట్ కొనుక్కున్నాడు. అంటే తన భార్యకు జూమ్ కాల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు తాను ఆ సూట్ వేసుకొని అటూ ఇటూ నడిచినా అది మీటింగ్‌లో పాల్గొన్న వారికి కనపడదు అనుకున్నాడు.
" style="height: 367px;">


అయితే ప్లాన్ ప్రకారం జూమ్ మీటింగ్ జరుగుతుండగా ఆ సూట్ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి దాన్ని తొడుక్కున్నాడు. అతను సూటుతో నడుస్తుంటే.. జూమ్ మీటింగ్‌లో కనిపించేసింది. ఆ సూట్ సరిగా పనిచెయ్యలేదు. సగం మనిషి కనిపిస్తూ... సగం కనిపించకుండా గ్రాఫిక్స్‌లా తయారైంది. పైగా అతను నడుస్తూ.. జూమ్ మీటింగ్ వైపు చూస్తూ చెయ్యి కూడా ఊపాడు. దీంతో ఈ మీటింగ్ పూర్తిగా డిస్టర్బ్ అయ్యింది. వీడియో మీరే చూడండి.

ఇక ఈ వీడియోని టిక్‌టాక్‌లో నెటిజన్లు బాగా చూస్తున్నారు. దీనికి ఇప్పటికే 60 లక్షల వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో మాత్రం 795 మందే చూశారు. మొత్తంగా దీన్ని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంత అవసరమా అని అనుకుంటున్నారు. "మామూలుగా అలా నడుస్తూ వెళ్లినా సరిపోయేది. ఈ సూట్ కారణంగా... ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయ్యింది" అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సారు ఎన్నిక‌ల్లో బిజీగా ఉన్నారు.. ఫోన్ మాట్లాడ‌రు

మహేష్ బాబు సోదరి పాత్రలో బాలీవుడ్ నటి ??

లీక్ అయిన రాధే శ్యామ్ కథలో అసలు నిజమెంత??

మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా..??

"జాతి రత్నాలు సినిమా చూసి నవ్వలేక చచ్చాను" అని అంటున్న టీమిండియా క్రికెటర్..?

వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. దాని కోసమేనా..??

ఇండియా, పాకిస్థాన్ మధ్య వర్తిగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>