SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/tvs-barc-cities-towns-rural-areas-no-connections-40-crs3dfa7e3f-dd13-4883-b0e1-eacbe4fff96b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/tvs-barc-cities-towns-rural-areas-no-connections-40-crs3dfa7e3f-dd13-4883-b0e1-eacbe4fff96b-415x250-IndiaHerald.jpgమరి ఇంత ఘనమైన బార్క్ చెప్పిన తాజా లెక్కేమిటయ్యా అంటే దేశంలో టీవీలు చూస్తున్న వారి సంఖ్య 89.2 కోట్లని. దేశంలో టీవీలున్న కుటుంబాల సంఖ్య 2020 చివరినాటికి సుమారుగా 21 కోట్లట. అంటే ప్రతి కుటుంబంలోను సగటున 4 సభ్యులుంటారని అనుకుంటే టీవీలు చూసేవారి సంఖ్య 89 కోట్లని లెక్కలు కట్టింది. బార్క్ లెక్కలు కట్టిందంటే దాదాపు కచ్చితమైన లెక్కే అయ్యుంటుంది. గడచిన ఏడాదికిపైగా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది కదా. అందుకనే జనాభాలో చాలామంది ఇళ్ళకే పరిమితమైపోయారు. దాంతో టీవీలు చూసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయిందని బార్క్tvs barc cities towns rural areas no connections 40 Crs;television;2020;air;population;manadesam;coronavirusహెరాల్డ్ సెటైర్ : టీవీలకు దూరంగా 40 కోట్లమంది..ఎంత హ్యాపీగా ఉండుంటారో ?హెరాల్డ్ సెటైర్ : టీవీలకు దూరంగా 40 కోట్లమంది..ఎంత హ్యాపీగా ఉండుంటారో ?tvs barc cities towns rural areas no connections 40 Crs;television;2020;air;population;manadesam;coronavirusSat, 17 Apr 2021 07:00:00 GMTఈరోజు న్యూస్ పేపర్లో ఓ వార్త ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. అదేమిటంటే దేశజనాభాలో సుమారు 40 కోట్లమంది టీవీకి దూరంగా ఉంటున్నారట. అంటే మనదేశ జనాభా 130 కోట్లమంది. ప్రతిరోజు టీవీలు చూస్తున్నవారి సంఖ్య సుమారు 89.2 కోట్లట. అంటే మిగిలిన కోట్లాదిమంది టీవీలు చూడటంలేదట. ఈ విషయం ఏదో గాలి మాటలు అనుకునేరు. మనదేశంలో టీవీ వ్యవహారాలను చూసేందుకు బార్క్ అని ఓ సంస్ధుంది. బార్క్ అంటే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రేటింగ్ కౌన్సిల్. మనకు ప్రసారమయ్యే కార్యక్రమాలు అంటే సీరియళ్ళు, సినిమాలు, స్పార్ట్స్, న్యూస్ తదితరాలన్నింటినీ ఎంతమంది జనాలు చూస్తున్నారు ? ఏ సమయంలో టీవీలను ఎక్కువమంది చూస్తున్నారు అని లెక్కేసేది బార్కే. ఈ సంస్ధ కట్టే లెక్కల మీదే ప్రోగ్రాముల రేటింగులు ఆధారపడుంటాయి.



మరి ఇంత ఘనమైన బార్క్ చెప్పిన తాజా లెక్కేమిటయ్యా అంటే దేశంలో టీవీలు చూస్తున్న వారి సంఖ్య 89.2 కోట్లని. దేశంలో టీవీలున్న కుటుంబాల సంఖ్య 2020 చివరినాటికి సుమారుగా 21 కోట్లట. అంటే ప్రతి కుటుంబంలోను సగటున 4 సభ్యులుంటారని అనుకుంటే టీవీలు చూసేవారి సంఖ్య 89 కోట్లని లెక్కలు కట్టింది. బార్క్ లెక్కలు కట్టిందంటే దాదాపు కచ్చితమైన లెక్కే అయ్యుంటుంది. గడచిన ఏడాదికిపైగా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది కదా. అందుకనే జనాభాలో చాలామంది ఇళ్ళకే పరిమితమైపోయారు. దాంతో 2020లో టీవీలు చూసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయిందని బార్క్ చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 9.1 కోట్లు, గ్రామీణప్రాంతాల్లో  12 కోట్లకు చేరుకుంటుందట.




అంటే అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 40 కోట్లమంది టీవీలు చూడటంలేదని అర్ధమైపోయింది. మరి వీరంతా ఎందుకని టీవీలు చూడకపోయినా ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అదేమిటంటే వాళ్ళంతా చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండే ఉంటారని. ఎందుకంటే సమాజంలో మనిపుడు చూస్తున్న చాలా దరిద్రాలకు టీవీలే కారణమని చెప్పకతప్పదు. పనికిమాలిన సీరియళ్ళు, క్రైంను ప్రోత్సహించే కార్యక్రమాలు, సినిమాలు, యువతను పెడదోవపట్టించే సినిమాలు లాంటివాటికి అన్ని కోట్లమంది దూరంగా ఉంటున్నారంటే కచ్చితంగా హ్యాపీగానే ఉండుంటారని అంచనా వేయచ్చు. నాగరీకత పేరుతో ఓటీటీ ప్లాట్ ఫారమ్ ల్లో వచ్చే కంటెంటును కుటుంబమంతా కలిసి చూడలేరు, చూడకుండా ఉండలేని పరిస్ధితి. ఇలాంటి పరిస్ధితి 40 కోట్లమందికి దొరికిందంటే ఎంత హ్యాపీనో కదా.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆకాశ‌వీధిలో క‌ల‌సిన తార‌... చిత్ర‌సీమ‌పై చెర‌గ‌ని ముద్ర‌వేసిన వివేక్‌...

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>