PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-ktra8c94315-c79a-4857-8c44-c531c5bf1769-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-ktra8c94315-c79a-4857-8c44-c531c5bf1769-415x250-IndiaHerald.jpgలింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను కలవడంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడుకి సమాచారం ఇవ్వకుండానే టీఆర్ఎస్ నేతలను రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ బృందం కేటీఆర్ ను కలిసిందని తెలుస్తోంది.bandi sanjay ktr;kcr;ktr;pragathi;sudigali sudheer;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;bojjala venkata sudhir reddy;ghmc;mla;war;reddy;partyబండి సంజయ్ పై బీజేపీ నేతల వార్?బండి సంజయ్ పై బీజేపీ నేతల వార్?bandi sanjay ktr;kcr;ktr;pragathi;sudigali sudheer;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;bojjala venkata sudhir reddy;ghmc;mla;war;reddy;partySat, 17 Apr 2021 08:58:48 GMTతెలంగాణ బీజేపీలో  వర్గ విభేదాల మరోసారి భగ్గుమన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నేతలు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తిరుగుబాటు చేశారని తెలుస్తోంది. సంజయ్ కు తెలియకుండానే గ్రేటర్ బీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో బండి సంజయ్ ఆగ్రహంతో రగిలిపోతున్నారని, గ్రేటర్ నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.

తెలంగాణలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు ఖాళీగా ఉన్న వార్డు, డివిజన్ సభ్యుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కూడా ఉంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది.

లింగోజిగూడ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నారు.  ఆయన ఏకగ్రీవానికి  సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ను  ప్రగతి భవన్ లో కలిసింది. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. దీంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్  చనిపోయినందున.. ఆ స్థానంలో పోటీ నుంచి విరమించుకుంటామని కేటీఆర్ వాళ్లకు హామీ ఇచ్చారు.మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్,  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కప బీజేపీ ప్రతినిధి బృందంతో పాటు ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.  

అయితే లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను కలవడంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడుకి సమాచారం ఇవ్వకుండానే టీఆర్ఎస్ నేతలను రామచంద్రరావు ఆధ్వర్యంలో  బీజేపీ బృందం కేటీఆర్ ను కలిసిందని తెలుస్తోంది. పార్టీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను కలవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. గెలిచే సీటు విషయంలో ఏకగ్రీవం కోసం అడగడం ఏంటని అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. బండి సంజయ్ తో మొదటి నుంచి రామచంద్రరావుకు మంచి సంబంధాలు లేవు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రామచంద్రరావు కోసం సంజయ్ సరిగా పని చేయలేదనే ప్రచారం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ తో రామచంద్రరావుకు మరింత గ్యాప్ పెరిగిందంటున్నారు.ఈ నేపథ్యంలో బండికి చెప్పకుండానే తన బృందంతో రామచంద్రరావు కేటీఆర్ ను కలిశారంటున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియా కరోనా మ్యూటెంట్ యమ డేంజరట!

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>