HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/snacks-iteames8a9c5d91-973b-4d5a-8697-e6704c0ee621-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/snacks-iteames8a9c5d91-973b-4d5a-8697-e6704c0ee621-415x250-IndiaHerald.jpgనిత్యం సాయంత్రం వేళ చాలామంది స్నాక్స్ తీసుకుంటుంటారు. లేదా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం స్నాక్స్ పేరు చెప్పి బిస్కెట్లు,చిప్స్, ఇతరత్రా నూనెలతో చేసిన పదార్థాలను ఇస్తూ ఉంటాము అలాగే తింటుంటాము. కానీ వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారం అవుతాము. అందువల్ల ఎవరైనా సరే ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినాల్సి ఉంటుంది. అసలు ఆరోగ్యకరమైన స్నాక్స్ అంటే ఏమిటి? వీటిని తినాలి అంటే... SNACKS ,ITEAMES;nithya new;samatha;pistachio;oil;cholesterol;almonds;common fig;shaktiఆరోగ్యవంతమైన స్నాక్స్ అంటే ఏమిటి? అసలు వేటిని తినాలో తెలుసా..!ఆరోగ్యవంతమైన స్నాక్స్ అంటే ఏమిటి? అసలు వేటిని తినాలో తెలుసా..!SNACKS ,ITEAMES;nithya new;samatha;pistachio;oil;cholesterol;almonds;common fig;shaktiSat, 17 Apr 2021 11:40:00 GMT
నిత్యం సాయంత్రం వేళ చాలామంది స్నాక్స్ తీసుకుంటుంటారు. లేదా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం స్నాక్స్ పేరు చెప్పి బిస్కెట్లు,చిప్స్, ఇతరత్రా నూనెలతో చేసిన పదార్థాలను ఇస్తూ ఉంటాము అలాగే తింటుంటాము. కానీ వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారం అవుతాము.  అందువల్ల ఎవరైనా సరే ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినాల్సి ఉంటుంది. అసలు ఆరోగ్యకరమైన స్నాక్స్ అంటే ఏమిటి? వీటిని తినాలి అంటే...

1). డ్రై ఫ్రూట్స్,సీడ్స్ : బాదంపప్పు, బ్లాక్ రైజీన్స్ ( నల్ల ద్రాక్ష కిస్ మిస్), పిస్తా,వాల్ నట్స్, అంజీర, డ్రై ఫ్రూట్స్ వంటివి స్నాక్స్ రూపంలో తినొచ్చు. ఇవి మన శరీరానికి కావాల్సిన పోషకాలు,ప్రొటీన్లు, కొవ్వులను అందిస్తాయి. అంతేకాకుండా హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

2). ప్రోటీన్ బార్స్ : వీటిని ఓట్స్,తేనే ఇతర సీడ్స్ తో  తయారు చేస్తారు. కనుక మనకి శక్తిని లభిస్తుంది. వీటిని తినడం వల్ల మనం అలసిపోకుండా ఉంటాము.వీటిని కూడా స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

3). శెనగలు : పొట్టుతో కూడిన శెనగలను కొద్దిగా పెనంపై వేయించుకొని, తరవాత తినడం వలన శరీరానికి శక్తిని, పోషకాలను అందించడంలో ఎంతో  సహాయపడతాయి.

4). మఖాన: స్నాక్స్ రూపంలో వీటిని కూడా తినవచ్చు. వీటిలో పీచు పదార్థం, మెగ్నీషియం,పొటాషియం లు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరం. అందువల్ల ఇవి శరీరానికి పోషకాలుగా లభిస్తాయి.

 5).కొబ్బరినీళ్లు: వీటిలో ఎలక్ట్రోలైట్స్ వుంటాయి. ఇవి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచుతాయి. శరీర కణాలకు ద్రవాలను అందిస్తాయి. కొబ్బరి నీళ్ళు తాగడం వలన శరీరం చల్లగా ఉంటుంది.

6). తాజా పండ్లు : తాజా పండ్లను స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

వీటన్నిటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇకపై నూనె వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించి, ఇలాంటి సహజసిద్ధమైన పోషకాలు ప్రాధాన్యం ఇవ్వడం  అలవాటు చేసుకోవాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తి కూడా లభిస్తుంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపి, తెలంగాణలో టెన్షన్.. టెన్షన్.. కొనసాగుతున్న పోలింగ్..

24 గంట‌ల్లో క‌రోనా కేసులు... మ‌ర‌ణాలు... భ‌యంక‌ర నిజాలు

టాలీవుడ్ లో పెరిగిపోతున్న టెక్నిషియన్స్ దందా !

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన లింగోజీగూడ ఉప ఎన్నిక..?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>