PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-f6eb62ba-6581-49ec-b4c1-45e36a60ec24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-f6eb62ba-6581-49ec-b4c1-45e36a60ec24-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా.. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆమె బాటలు వేసుకుంటున్నారు. ఆమె పార్టీ పెడతారని కొన్ని నెలల క్రితమే వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఆమె కూడా దాన్ని ధ్రువీకరించింది. ఆ తర్వాత తెలంగాణలోని జిల్లాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. ఖమ్మం సభతో షర్మిల తాను కూడా బలమైన రాజకీయ నాయకురాలినే అన్న సంకేతాలు పంపింది. మొదట్లో ఆమెను లైట్ గా తీసుకున్నవారు సైతం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయానికి అవసరమైన మెరుపు వేగం షర్మిల చూపys-sharmila;view;telangana;indira gandhi;police;khammam;lie;partyతెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?ys-sharmila;view;telangana;indira gandhi;police;khammam;lie;partyFri, 16 Apr 2021 09:01:00 GMTతెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా.. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆమె బాటలు వేసుకుంటున్నారు. ఆమె పార్టీ పెడతారని కొన్ని నెలల క్రితమే వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఆమె కూడా దాన్ని ధ్రువీకరించింది. ఆ తర్వాత తెలంగాణలోని జిల్లాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. ఖమ్మం సభతో షర్మిల తాను కూడా బలమైన రాజకీయ నాయకురాలినే అన్న సంకేతాలు పంపింది. మొదట్లో ఆమెను లైట్ గా తీసుకున్నవారు సైతం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

రాజకీయానికి అవసరమైన మెరుపు వేగం షర్మిల చూపిస్తున్నారు. ఖమ్మంలో పార్టీ సభ పెట్టిన రోజే అదే సభావేదికపై నుంచి ఆమె నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తానన్న ప్రకటన చేశారు. ఏప్రిల్ 9 న ఖమ్మంలో సభ పెడితే.. ఏప్రిల్ 15న దీక్ష చేస్తానని ప్రకటించారు. అంటే ఒక కార్యక్రమం తర్వాత మరో కార్యక్రమం ఆమె పక్కగా ప్లాన్ చేసుకుంటున్నారనే  చెప్పాలి. ఇక ఇందిరా పార్క్‌ వద్ద  ఆమె నిరాహార దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాల ద్వారా ఆమె తెలివిగా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.

ఒక్క రోజు మాత్రమే దీక్షకు అనుమతి ఇచ్చినా 72 గంటల దీక్ష చేసి తీరుతానని ప్రకటించడం.. పోలీసులు దీక్ష ముగించమని కోరితే.. అక్కడి నుంచి లోటస్ పాండ్‌ కు పాదయాత్ర ప్రారంభించడం.. ఆ తర్వాత ఆమె అరెస్టు వంటి పరిణామాలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె చెబుతున్నారు. ఆమె జాకెట్ చినగడం, చేతి మణికట్టుకు గాయం కావడం కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.

ఈ పరిణామాలతో ఆవేశపడిన ఆమె వెంటనే త్వరలోనే పాదయత్ర చేస్తానని ప్రకటన కూడా చేశారు. జూలై 8 న పార్టీ ప్రకటన ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. అదే రోజు పాదయాత్రను ప్రారంభించడం కానీ.. ఆ రోజు పాదయాత్రపై ప్రకటన చేయడం కానీ జరగొచ్చు. పాదయాత్ర చేస్తానని  ఆమె స్పష్టంగా చెప్పేశారు. ఇలా వరసగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న  షర్మిల తన దూకుడు ప్రదర్శిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీళ్ళు అసలు మనుషులేనా.. కోడలి పై అలా..

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>