PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-betting-ido-vichitramina-attaf0c2c898-d577-4ae0-ac04-2179056c6766-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-betting-ido-vichitramina-attaf0c2c898-d577-4ae0-ac04-2179056c6766-415x250-IndiaHerald.jpgదేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తుంది. సెకండ్‌వేవ్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు న‌‌మోద‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా 24గంట‌ల్లో గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా 2,00,739 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో క‌ర్ఫ్యూలు, వారాంత‌పు లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌తోపాటు ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. భారీగా పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో దేశంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తుంద‌నే చ‌ర్చ‌జోరుగా సాగుతుంది. ఇప్ప‌టిLock down;delhi;cricket;police;festival;central governmentలాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!లాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!Lock down;delhi;cricket;police;festival;central governmentFri, 16 Apr 2021 13:47:25 GMTమీరెప్పుడైనా బెట్టింగ్‌లు క‌ట్టారా..? ఒక‌వేళ బెట్టింగ్‌ల‌లో పాల్గొని ఉంటే క్రికెట్ బెట్టింగ్‌లోనో, రాజకీయాల్లో గెలుపోట‌ముల‌పైనో బెట్టింగ్‌లు పెట్టిఉంటారు.. కానీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా విచిత్ర‌మైన అంశంపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.. ఇది విన్న ప్ర‌తిఒక్క‌రూ.. అంతా క‌రోనా మ‌హిమ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత‌కీ ఏ అంశంపై బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయో తెలుసుకోవాల‌ని ఉందా..? అదేనండీ.. లాక్‌డౌన్ బెట్టింగ్‌.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తుంది. సెకండ్‌వేవ్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు న‌‌మోద‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా 24గంట‌ల్లో గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా 2,00,739 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో క‌ర్ఫ్యూలు, వారాంత‌పు లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌తోపాటు ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. భారీగా పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో దేశంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తుంద‌నే చ‌ర్చ‌జోరుగా సాగుతుంది. ఇప్ప‌టికే లాక్‌డౌన్ అంశం సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం సాగుతుంది. మే 2నుంచి లాక్‌డౌన్ విధిస్తార‌ని ప్ర‌చారం సాగుతుంది. ఇదే అంశాన్ని బుకీలు క్యాష్ చేసుకుంటున్నారు.

మే2 నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉంటుంద‌ని బుకీలు బెట్టింగ్‌లు షురూ చేశారు. దీంతో కేంద్రం లాక్‌డౌన్ విధిస్తుంద‌ని కొంద‌రు, లాక్‌డౌన్ విధించ‌ద‌ని కొంద‌రు బెట్టింగ్‌ల‌లో పాల్గొంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఐపీఎల్ త‌ర‌హాలో లాక్‌డౌన్ బెట్టింగ్‌లు దేశ‌వ్యాప్తంగా సాగుతుండ‌టం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. గ‌తేడాది సైతం లాక్‌డౌన్‌, కోవిడ్ తీవ్ర‌తపై బెట్టింగ్‌లు కొన‌సాగినా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థాయిలో సాగ‌లేద‌ని ప‌లువురు బుకీలు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఏ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తారు..? ఏ రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ విధిస్తారు..?  దేశంలో క‌రోనా కేసులు ఎన్నివేలు న‌మోద‌వుతాయి..?  ఏ రాష్ట్రంలో ప‌రీక్ష‌లు ర‌ద్దుచేస్తారు..? ఏఏ త‌ర‌గ‌తులకు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తారు..? వంటి అంశాల‌పై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయట‌. అయితే పోలీసులు ఈ అంశంపై దృష్టిసారించారు. బెట్టింగ్ రాయుళ్లు, బుకీల‌పై కొర‌డా ఝుళిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.క‌రోనా పుణ్య‌మా అంటూ బుకీలు పండుగ చేసుకుంటున్నారు. ఒక‌వైపు ఐపీఎల్‌, మ‌రోవైపు లాక్ డౌన్ బెట్టింగ్‌లతో జేబులు నింపుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలకు హెల్ప్ చేస్తున్న మాజీ ఎంపీ...?

స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!

ఇలా అయితే థియేటర్స్ నడపడం మా వల్ల కాదు.. !!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>