కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టుల మీదే గోదారి ప‌ర‌వ‌ళ్లు : మాడ్యం

నాడు కాంగ్రెస్ పార్టీ నాటిన క‌ట్ట‌డాల మీద‌నే ఈనాడు గోదావ‌రి నీళ్లు పారుతున్నాయ‌ని అన్నారు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ కార్య‌ద‌ర్శి మాడ్యం బాల‌కృష్ణ‌. రైతుల క‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకొని మెద‌క్‌జిల్లాలో భాగ‌మైన హాల్డీ ప్రాజెక్ట్ నాడు కాంగ్రెస్ పార్టీ హ‌యంలో పూర్తి చేశార‌న్నారు. మెద‌క్‌లో జిల్లాలో పుట్టిన అని చెప్ప‌కుంటున్న కేసీఆర్, సొంత జిల్లాకు చేసింది ఏం లేద‌ని విమ‌ర్శించారు. న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో భాగ‌మైనా…. హాల్దీ ప్రాజెక్ట్‌, మెద‌క్ జిల్లాలోని చిన్న‌శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి గుండా ప్ర‌వ‌హిస్తుంద‌ని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నీటిని వ్య‌వ‌సాయం కోసం ధ‌రిప‌ల్లి వ‌ర‌కు కాలువ‌ల ద్వారా పంపిణీ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ధ‌రిప‌ల్లి మీదుగా సూరారం, జంగ‌రాయి వ‌ర‌కు ప్రాజెక్ట్ కాలువ ప‌రివాహాక ప్రాంతం ఈ ప్రాంత రైతుల‌కు న్యాయం చేయాల‌న్నారు.