MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-771d9849-00ef-47ac-9907-3a64d476ed5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-771d9849-00ef-47ac-9907-3a64d476ed5a-415x250-IndiaHerald.jpg‘వ‌కీల్ సాబ్’ విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల పెంపును వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై హైకోర్టు కూడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించడంతో భారీ రేట్లకు ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లకు ఈ నిర్ణయం నష్టం కలిగిస్తుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో చాలామందికి వచ్చాయి.అయితే ఈ టిక్కెట్ల రేట్ల మార్పుకు సంబంధించి జరిగిన రగడను మీడియా ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ చాల హైలెట్ చేయడంతో పవన్ అభిమానులు కానివారు కూడ అసలు ‘వకీల్ సాబ్’ లో ఏముంది అన్న సింపతి క్రియేట్ అయి గత pavankalyan;;pawan;ram gopal varma;raj;ram pothineni;andhra pradesh;cinema;media;producer;love;industry;husband;producer1;dil;love storyవకీల్ సాబ్ కు అదృష్టంగా మారిన టికెట్ల రట్ల సమస్య !వకీల్ సాబ్ కు అదృష్టంగా మారిన టికెట్ల రట్ల సమస్య !pavankalyan;;pawan;ram gopal varma;raj;ram pothineni;andhra pradesh;cinema;media;producer;love;industry;husband;producer1;dil;love storyFri, 16 Apr 2021 08:00:00 GMT‘వ‌కీల్ సాబ్’ విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల పెంపును వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై హైకోర్టు కూడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించడంతో భారీ రేట్లకు ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లకు ఈ నిర్ణయం నష్టం కలిగిస్తుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో చాలామందికి వచ్చాయి.


అయితే ఈ టిక్కెట్ల రేట్ల మార్పుకు సంబంధించి జరిగిన రగడను మీడియా ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ చాల హైలెట్ చేయడంతో పవన్ అభిమానులు కానివారు కూడ అసలు ‘వకీల్ సాబ్’ లో ఏముంది అన్న సింపతి క్రియేట్ అయి గత కొద్ది రోజులుగా ‘వకీల్ సాబ్’ ధియేటర్లకు వచ్చి ఆ సినిమాను చూసే విధంగా పరిస్థితులు మారడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్.


‘వకీల్ సాబ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీ ప్రమోషన్ ను ఏమాత్రం చేయలేకపోయారు. ఈమూవీ విడుదల అయ్యాక పవన్ కరోనా భయంతో క్వారెంటైన్ లోకి వెళ్ళిపోవడంతో పాటు నిర్మాత దిల్ రాజ్ కు కూడ కరోనా రావడంతో ‘వకీల్ సాబ్ ప్రమోషన్ పూర్తిగా ఆగిపోయింది. అయితే ఈ విషయాలను పట్టించు కోకుండా సగటు ప్రేక్షకులు ‘వకీల్ సాబ్’ ధియేటర్ల వైపు వస్తున్నట్లు సూచనలు వస్తున్నాయి.


కరోనా భయాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేక్షకులు ‘వకీల్ సాబ్’ ధియేటర్ల వైపు వస్తూ ఉండటంతో ఈమూవీ ధియేటర్లలో ప్రస్తుతం 50 శాతం వరకు సీట్స్ ఫుల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈవారం విడుదల కావలసిన ‘లవ్ స్టోరీ’ వాయిదా పడటంతో సినిమాలు చూడాలి అని భావించే వారికి ‘వకీల్ సాబ్’ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. రామ్ గోపాల్ వర్మ ‘దెయ్యం’ తో పాటు మరో రెండు చిన్న సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ సగటు ప్రేక్షకుడు ‘వకీల్ సాబ్’ వైపు మొగ్గు చూపే ఆస్కారం కనిపిస్తోంది. దీనితో ‘వకీల్ సాబ్’ ను ఎవరు దెబ్బ కొట్టలేక పోయారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్కో బెడ్ పై ఇద్దరు పేషెంట్లు.. కరోనా కల్లోలం

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>