SpiritualityGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ramana-maharshibfc828f0-4b2a-4c24-8dc9-94a6539b75b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ramana-maharshibfc828f0-4b2a-4c24-8dc9-94a6539b75b0-415x250-IndiaHerald.jpgభ‌గ‌వాన్ ర‌మ‌ణుల ద‌ర్శ‌నం కోసం ఎంతోమంది భ‌క్తులు అరుణాచ‌లం వ‌చ్చేవారు. వారిలో విదేశాల నుంచి వ‌చ్చే భ‌క్తులు కూడా ఉంటారు. పిగాట్ అనే యూరోపియ‌న్ మ‌హిళ భ‌గ‌వానుల ద‌ర్శ‌నం కోసం త‌రుచుగా వ‌స్తుండేవారు. ఒక‌రోజు ఆమె ర‌మ‌ణుల‌ను ఆహార నియ‌మాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడిగారు. అందుకు మ‌హ‌ర్షులు ఇచ్చిన స‌మాధానాలు ఇలా ఉన్నాయి. భక్తురాలు : ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నుడైన సాధకునికి ఎటువంటి ఆహారం నిర్దేశించబడినది? మహ‌ర్షులు: సాత్వికము, అది కూడా మితంగా.ramana maharshi;india;korcha;european union;shaktiనువ్వు వార్త‌లు చ‌దివే కంప్యూట‌ర్‌కు కూడా ప్రాణ‌ముంటుంది!!నువ్వు వార్త‌లు చ‌దివే కంప్యూట‌ర్‌కు కూడా ప్రాణ‌ముంటుంది!!ramana maharshi;india;korcha;european union;shaktiFri, 16 Apr 2021 08:50:15 GMTభ‌గ‌వాన్ ర‌మ‌ణుల ద‌ర్శ‌నం కోసం ఎంతోమంది భ‌క్తులు అరుణాచ‌లం వ‌చ్చేవారు. వారిలో విదేశాల నుంచి వ‌చ్చే భ‌క్తులు కూడా ఉంటారు. పిగాట్ అనే యూరోపియ‌న్ మ‌హిళ భ‌గ‌వానుల ద‌ర్శ‌నం కోసం త‌రుచుగా వ‌స్తుండేవారు. ఒక‌రోజు ఆమె ర‌మ‌ణుల‌ను  ఆహార నియ‌మాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడిగారు. అందుకు మ‌హ‌ర్షులు ఇచ్చిన స‌మాధానాలు ఇలా ఉన్నాయి.

భక్తురాలు : ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నుడైన సాధకునికి ఎటువంటి ఆహారం నిర్దేశించబడినది?
మహ‌ర్షులు: సాత్వికము, అది కూడా మితంగా.

భక్తురాలు: సాత్వికాహారం అంటే  ?
మహ‌ర్షులు: రొట్టె, పండ్లు ,కాయగూరలు, పాలు మొదలైనవి.

భక్తురాలు: ఉత్తర భారతదేశంలో కొందరు చేపలు తింటారు. అలా చేయవచ్చా?
మహర్షులు సమాధానం ఇవ్వలేదు.

భ: మా యురోపియన్లకు ఒక విధమైన భోజనం అలవాటు . అది మారిస్తే ఆరోగ్యమే కాక మనసు కూడా బలహీనమ‌వుతుంది. శరీర ఆరోగ్యము చూసుకోవాలి కదా ?
మ: తప్పకుండా.. శరీర బలం తగ్గేకొద్దీ మనోబలం పెరుగుతుంది.

భ: మాకు అలవాటు పడిన భోజనం మారిస్తే  ఆరోగ్యం, మనోబలం కూడా క్షీణిస్తాయి క‌దా!
మ: మనోబలం అంటే మీ ఉద్దేశం ఏమిటి ?

భ: లోకంతో ముడిప‌డిన శక్తి.
మ: ఆహార గుణం మనసుపై ప్రభావం చూపుతుంది. తినే ఆహారమే మనసును పోషిస్తుంది .

భ: అవునా!! అలా అయితే మా యూరోపియన్లు సాత్వికాహారంతో సరిపుచ్చుకోవ‌డ‌మెలా?
మ: (అక్క‌డే ఉన్న ఇవాన్ వెంట్జ్ ను ఉద్దేశించి) మేము తీసుకునే ఆహారమే కదా నీవూ తీసుకునేది? అది నీకు అనుకూలంగా లేదా?

ఇవాన్ వెంట్జ్ : అనుకూలమే. నేను ఈ భోజనానికి అలవాటుపడి పోయాను .
భ: అలా అలవాటు పడని వారి విషయం ఏమిటి?
మ: పరిస్థితుల్లో సర్దుబాటే అలవాటు. ప్రధానమైనది మనసు. నిజమేంటంటే కొన్ని ఆహార పదార్థాలు రుచికరమైనవి, హితమైనవి మనస్సుకు నేర్పాలి. పోషక పదార్థాలు శాకాహారములోనూ ,మాంసాహారము లోనూ రెంటిలోనూ సమృద్ధిగానే ఉన్నాయి. కానీ మనసు తనకు అలవాటైనవాటిని రుచికరమని తలచి ఆ ఆహారాన్ని కోరుకుంటుంది .

భ: ఇదే విధంగా జ్ఞానికి కూడా ఆహార నియమాలు ఉన్నాయా?
మ:  లేవు. ఆయన స్థిరంగా ఉంటాడు. తాను తీసుకునే ఆహారంతో తాను ప్రభావితుడు కాడు.

భ: మాంసాహారం తయారు చేయాలంటే ఏదైనా జీవిని చంపవలసిందే కదా?
మ: యోగసాధనా అహింస అత్యంత ప్రధానమైనది.

భ: మొక్కలకు కూడా ప్రాణముంది కదా ?
మ: అదే విధంగా నువ్వు కూర్చున్న రాతికి కూడా ప్రాణముంది !

భ: మేము క్రమంగా శాకాహారాన్ని అలవాటు చేసుకోవచ్చా?
మ: అవును. అదే మార్గం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీళ్ళు అసలు మనుషులేనా.. కోడలి పై అలా..

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>