MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani3b3f0ba3-557c-4dd9-b14c-ec8099054bd8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani3b3f0ba3-557c-4dd9-b14c-ec8099054bd8-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఒక్కో సినిమాతో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి క్రేజ్, పాపులారిటీ మార్కెట్ తో కొనసాగుతున్న నటుడు నాని. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో న్యాచురల్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న నాని ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. వాటిలో ఒకటి టక్ జగదీష్ కాగా మరొకటి శ్యామ సింగరాయ్ అలానే ఇంకొకటి అంటే సుందరానికి .వీటిలో టక్ జగదీష్ సినిమా ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. జగపతి బాబు, నాని కి సోదరుడు గా నటిస్తున్న ఈ సినిమాకి యువ దర్శtuck-jagadish;auto;nani;shiva;siva nirvana;thaman s;cinema;youtube;you tube;audience;director;lord siva;vegetable market;success;yuva;kusuma jagadish;shiva nirvana;rajahmundry;tuck jagdish;tuck jagadishలేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సూపర్ హిట్ కొడతారట..... ??లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సూపర్ హిట్ కొడతారట..... ??tuck-jagadish;auto;nani;shiva;siva nirvana;thaman s;cinema;youtube;you tube;audience;director;lord siva;vegetable market;success;yuva;kusuma jagadish;shiva nirvana;rajahmundry;tuck jagdish;tuck jagadishFri, 16 Apr 2021 08:46:52 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఒక్కో సినిమాతో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి క్రేజ్, పాపులారిటీ మార్కెట్ తో కొనసాగుతున్న నటుడు నాని. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో న్యాచురల్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న నాని ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. వాటిలో ఒకటి టక్ జగదీష్ కాగా మరొకటి శ్యామ సింగరాయ్ అలానే ఇంకొకటి అంటే సుందరానికి .వీటిలో టక్ జగదీష్ సినిమా ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. జగపతి బాబు, నాని కి సోదరుడు గా నటిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా నుండి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి అలాగే కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ యొక్క ఒక పరిచయ వేడుక రాజమండ్రి లో ఎంతో వైభవంగా జరిగింది. మరోవైపు ఈ సినిమా పై నాని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని ఈ నెల 23న విడుదల చేయాలని ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. 

అయితే ప్రస్తుతం మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా యొక్క సెకండ్ వేవ్ విస్తృతంగా కొనసాగుతుండటంతో ఇటువంటి పరిస్థితుల్లో తమ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయలేమని అతి త్వరలో తదుపరి విడుదల తేదీని ప్రకటిస్తామని నాచురల్ స్టార్ నాని రెండు రోజుల క్రితం ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు. అయితే అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా నాని ఫ్యాన్స్ ను కూడా ఎంతో అలరించే విధంగా పక్కా యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని రిలీజ్ పరంగా కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా థియేటర్స్ లోకి వచ్చే టక్ జగదీష్ బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.......!




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీళ్ళు అసలు మనుషులేనా.. కోడలి పై అలా..

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>