PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayodhya-temple-construction43da1030-c417-4d8c-b5de-9409f2103cf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayodhya-temple-construction43da1030-c417-4d8c-b5de-9409f2103cf9-415x250-IndiaHerald.jpgభారతదేశంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో తెలిసిన విషయమే. అయితే ఈ ఆలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించింది. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు భారీగా విరాళాలు సమర్పించారు. AYODHYA-TEMPLE-CONSTRUCTION;anil music;govi;thirtha;india;doctor;ayodhyaఅయోధ్య విరాళ చెక్కుల్లో...కోట్ల రూపాయల చెక్కులు బౌన్స్...?అయోధ్య విరాళ చెక్కుల్లో...కోట్ల రూపాయల చెక్కులు బౌన్స్...?AYODHYA-TEMPLE-CONSTRUCTION;anil music;govi;thirtha;india;doctor;ayodhyaFri, 16 Apr 2021 16:32:05 GMTభారతదేశంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో తెలిసిన విషయమే. అయితే ఈ ఆలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించింది. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు భారీగా విరాళాలు సమర్పించారు. ఇప్పటి వరకు అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశం నలువైపుల నుంచి సుమారు 2,500 కోట్ల విరాళాలు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విరాళాల విషయంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం దేశంలో పలు వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. మాములుగా విరాళాలు ఇచ్చే వారు ఏ విధంగా అయినా అమౌంటును ఇవ్వొచ్చు. 

అందులో చెక్కుల రూపంలో కూడా విరాళాలు వచ్చాయి. ఈ విధంగా విరాళాలుగా ట్రస్ట్ కు వచ్చిన చెక్కుల లో... భారీ సంఖ్యలో చెక్కులు బౌన్స్ అయినట్లు తెలిసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆడిట్‌ చేయగా ఈ సంగతి బయటపడింది. దాదాపు 15 వేల చెక్కులు వరకు బౌన్స్ అయినట్లు తెలుస్తోంది. సుమారు ఈ బౌన్స్ అయిన చెక్కలు మొత్తం రెండు కోట్లకు పైగానే ఉంటుందని వారి అంచనా. పూర్తి వివరాల్లోకి వెళితే.. విరాళాలు ఇచ్చిన కొంత మంది బ్యాంకు ఖాతాలలో నగదు లేకపోవడం వల్లనే వారిచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్లుగా తేలింది. మరి కొంత మంది ఇచ్చిన చెక్కులలో సంతకాలు మ్యాచ్ కాకపోవడం వలన బౌన్స్ అయినట్లు సమాచారం.

ఈ విషయం గురించి మాట్లాడిన ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా  ప్రస్తుత సభ్యులు బ్యాంకు వారితో సంప్రదింపులు జరిపారని... తప్పులను సరిదిద్దుకుని తిరిగి నూతన చెక్కులను తిరిగి అందించే అవకాశం బ్యాంకు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇదే విషయంపై స్పందించిన ట్రస్టు ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి చెల్లని చెక్కులను తిరిగి విరాళాలు ఇచ్చిన వారికే పంపి .. వాటికి బదులుగా కొత్త చెక్కులు పంపాలని కోరనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయం ఇప్పుడు దేశమంతా పాకిపోయింది. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటారా తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బుట్టబొమ్మకి వరస ఆఫర్లు.. రెమ్యూనరేషన్ పెంచినా కూడా ఆగని అవకాశాలు..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి

సాక్షి మీడియాను బ‌హిష్క‌రించండి

పవన్ కి కరోనా టెస్ట్.. రిపోర్టు ఎలా ఉందంటే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>