PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6abfc460-6fe2-4dc7-80b1-bb27d021f8ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6abfc460-6fe2-4dc7-80b1-bb27d021f8ba-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ఉధృతి మామూలుగా లేదు. అతి తక్కువ కాలంలోనే దేశంలో కేసుల సంఖ్య ఏకంగా రోజులు 2 లక్షలు దాటింది. ఏపీలోనూ క్రమంగా కరోనా విజృంభిస్తోంది. నిన్న ఏకంగా ఒక్కరోజే 5 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఏపీ సర్కారు అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెండో దఫా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ 19 నిర్వహణ, వ్యాప్తి నిరోధక చర్యలు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకాధికారులను నియమించింది. మొత్తం 21 మంది ఐఎఎస్ అధికారులు, jagan;kumaar;abhishek;praveen;srikanth;vinod kumar;jagan;mandula;andhra pradesh;arogyasri;piyush chawlaకరోనా సెకండ్‌ వేవ్‌తో జగన్ అలర్ట్.. అర్జంట్‌గా ఏం చేశారంటే..!కరోనా సెకండ్‌ వేవ్‌తో జగన్ అలర్ట్.. అర్జంట్‌గా ఏం చేశారంటే..!jagan;kumaar;abhishek;praveen;srikanth;vinod kumar;jagan;mandula;andhra pradesh;arogyasri;piyush chawlaFri, 16 Apr 2021 07:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ ఉధృతి మామూలుగా లేదు. అతి తక్కువ కాలంలోనే దేశంలో కేసుల సంఖ్య ఏకంగా రోజులు 2 లక్షలు దాటింది. ఏపీలోనూ క్రమంగా కరోనా విజృంభిస్తోంది. నిన్న ఏకంగా ఒక్కరోజే 5 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఏపీ సర్కారు అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెండో దఫా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ 19 నిర్వహణ, వ్యాప్తి నిరోధక చర్యలు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకాధికారులను నియమించింది.

మొత్తం 21 మంది ఐఎఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులతో కోవిడ్ 19 నిర్వహణా కమిటీని ఏపీ సర్కారు నియమించింది. కోవిడ్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవల పర్యవేక్షణ బాధ్యతలను  ఎంటి కృష్ణబాబుకు అప్పగించారు జగన్. కోవిడ్ రోగులు ట్రేసింగ్, టెస్టింగ్ లాంటి కార్యక్రమాల పర్యవేక్షణ చూసే కోవిడ్ మేనేజ్ మెంట్ బాధ్యతలను ముఖ్యకార్యదర్శి ఎం. రవిచంద్రకు అప్పగించారు. సీసీటీవీ, హెల్ప్ డెస్క్ పర్యవేక్షణ కోసం పీయూష్ కుమార్ ను నియమించారు.

కోవిడ్ సమయంలో కీలకమైన 104 కాల్ సెంటర్ల మెరుగైన నిర్వహణ కోసం బాబు. ఏ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ మల్లిఖార్జునకు ల్యాబ్ ల నిర్వహణ, ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ సేవల కోసం నియమించారు. కోవిడ్ మందుల కొనుగోళ్లు,  ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం విజయరామరాజును నియమించారు. మెడికల్ ఆక్సిన్ సరఫరా పర్యవేక్షణ కోసం షన్మోహన్ ను నియమించారు.

క్లినికల్ మేనేజ్ మెంట్ కోసం వినోద్ కుమార్ ను నియమించింది ప్రభుత్వం. ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ ఫీజులు వసూళ్ల ఫిర్యాదుల పర్యవేక్షణను ఐపీఎస్ అధికారులు అభిషేక్ మోహంతి, కోయ ప్రవీణ్ కు అప్పగించారు. కోవిడ్ సమాచారం, సామాజిక మాధ్యమాలు ఇతర అంశాలను ఆర్జా శ్రీకాంత్ కు అప్పగించారు. 2019కి చెందిన 11 మంది ఐఎఎస్ అధికారులను 104 కాల్ సెంటర్ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ అంశాల పర్యవేక్షణకు జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను ఇంచార్జులుగా నియమించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

6 నెలల బిడ్డను బలిచ్చిన తల్లి?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>