PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/telangana-congress-lo-mallee-lolli-shuru1cde9a51-a1ed-44b5-a00a-5b9eca449d7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/telangana-congress-lo-mallee-lolli-shuru1cde9a51-a1ed-44b5-a00a-5b9eca449d7c-415x250-IndiaHerald.jpg2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి తరువాత ఉత్తమ్‌ను తొలగించి టీపీసీసీ కొత్త సారథిని ఎంపిక చేస్తామని అధిష్టానం ప్రకటిచింది. అప్పటికే కాంగ్రెస్‌లో వర్గాల వారిగా విడిపోయిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు టీపీసీసీ చీఫ్‌ స్థానాన్ని దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేశారు.Telangana congress;nagarjuna akkineni;nagarjuna sagar dam;telangana;tpcc;minister;janareddy;central government;party;santoshamటీ కాంగ్రెస్‌లో మ‌ళ్లీ లొల్లిషురూ!టీ కాంగ్రెస్‌లో మ‌ళ్లీ లొల్లిషురూ!Telangana congress;nagarjuna akkineni;nagarjuna sagar dam;telangana;tpcc;minister;janareddy;central government;party;santoshamFri, 16 Apr 2021 11:51:06 GMTనాగార్జున సాగర్‌ ఉపఎన్నికల సమరంలో ఏకతాటిపైకి వచ్చి జానారెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌ నేతలను చూసి పార్టీ శ్రేణులు తెగ సంబరపడిపోతున్నారు. జానారెడ్డి గెలుపోటమి సంగతి అలాఉంచితే.. ఈ ఉపఎన్నికతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా ఒకే తాటిపైకి వచ్చారన్న సంతోషం కాంగ్రెస్‌ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చట కానుంది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌ మాట్లాడుతూ.. సాగర్‌ ఉపఎన్నికల తరువాత కొత్త టీపీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆయన ఈ ప్రకటన చేసిన సమయం నుండే టీపీసీసీ చీఫ్‌ కోసం ముఖ్యనేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారట. దీంతో మళ్లి లొల్లి షురూ అయిందంటూ కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొంటుండటం గమనార్హం.

2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి తరువాత ఉత్తమ్‌ను తొలగించి టీపీసీసీ కొత్త సారథిని ఎంపిక చేస్తామని అధిష్టానం ప్రకటిచింది. అప్పటికే కాంగ్రెస్‌లో వర్గాల వారిగా విడిపోయిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు టీపీసీసీ చీఫ్‌ స్థానాన్ని దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణ పార్టీ పగ్గాలు తనకే అప్పగించాలంటూ పలువురు నేతలు ఎవరికివారు ఢిల్లి వెళ్లి మరీ పైరవీలు చేశారు. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇక రేవంత్‌ ఎంపిక లాంఛనమే అనుకున్న క్రమంలో కాంగ్రెస్‌లోని రేవంత్‌ వ్యతిరేఖ వర్గీయులు, పలువురు సీనియర్‌ నేతలు రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తే తాము పార్టీని వీడుతామని కేంద్ర పార్టీ నేతల వద్ద కుండబద్దలు కొట్టారు. దీంతో టీపీసీసీ చీఫ్‌ ఎంపిక వాయిదా పడుతూనే వస్తుంది.

గత కొద్దికాలంగా టీపీసీసీ చీఫ్‌ ఎంపిక విషయంపై ఎలాంటి చర్చ లేకపోవటంతో కాంగ్రెస్‌ నేతలుసైతం వర్గపోరుకు విరామం ఇచ్చారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక ప్రకటన రావటంతో, అందరికి ఆమోదయోగ్యమైన మాజీ మంత్రి, సీనియర్‌ నేత జానారెడ్డి బరిలోకి దిగడంతో ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఏకతాటిపైకి వచ్చి ప్రచారాన్ని హోరెత్తించారు. వర్గాల వారిగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకొనే కాంగ్రెస్‌ నేతలంతా ఒకేతాటిపైకి రావడంతో ఇక కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఖాయమనుకుంటూ సంతోషంలో ఉన్న పార్టీ శ్రేణులకు మాణిక్య ఠాగూర్‌ ప్రకటన మళ్లి కలవరానికి గురిచేస్తుంది. టీపీసీసీ చీఫ్‌కోసం మళ్లి కాంగ్రెస్‌ నేతలు వర్గాలు విడిపోవటం ఖాయమని, లొల్లిమళ్లి షురూ అయినట్లే అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పార్టీ అధిష్టానం అయినా నాన్చుడు దోరణి అవలంభించకుండా, ముందస్తు ప్రకటనలు చేయకుండా కొద్దిమంది ముఖ్యనేతలందరితో ఒకేసారి భేటీ అయ్యి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవర్ స్టార్ కరోనా టెస్ట్ రిజల్ట్ వచ్చేసింది..!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>