PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-516d8105-8c66-463f-8819-52cc623e764f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-516d8105-8c66-463f-8819-52cc623e764f-415x250-IndiaHerald.jpgజగనన్న బాణాన్ని నేను అని ఒకనాడు ఆమె వస్తూంటే జగన్ ఫ్యాన్స్ ఈలలు వేశారు, గోల పెట్టారు. ఎందుకంటే నాడు ప్రత్యర్ధుల మీద ఆ బాణం దూసుకువెళ్తోంది కాబట్టి. ఇపుడు అదే బాణం గురి మారింది, టార్గెట్ కూడా మార్చుకుంది. అవును. జగన్ మీద వ్యతిరేకతతో షర్మిల తెలంగాణాలో రాజకీయం చేస్తున్నారు sharmila;tara;hyderabad;jagan;y. s. rajasekhara reddy;rajya sabha;media;television;king;air;central government;ycp;sakshi;partyషర్మిల బాణం దూసుకువస్తోంది...?షర్మిల బాణం దూసుకువస్తోంది...?sharmila;tara;hyderabad;jagan;y. s. rajasekhara reddy;rajya sabha;media;television;king;air;central government;ycp;sakshi;partyFri, 16 Apr 2021 11:51:26 GMTజగనన్న బాణాన్ని నేను అని ఒకనాడు ఆమె వస్తూంటే జగన్ ఫ్యాన్స్ ఈలలు వేశారు, గోల పెట్టారు. ఎందుకంటే నాడు ప్రత్యర్ధుల మీద ఆ బాణం దూసుకువెళ్తోంది కాబట్టి. ఇపుడు అదే బాణం గురి మారింది, టార్గెట్ కూడా మార్చుకుంది.

అవును. జగన్ మీద వ్యతిరేకతతో షర్మిల తెలంగాణాలో రాజకీయం చేస్తున్నారు అని మొదట్లో అంటే ఎవరూ అసలు పట్టించుకోలేదు. జగన్ కి షర్మిలకు మధ్య గొడవలు ఎందుకు ఉంటాయి అని అనుకున్నారు. ఇదంతా కట్టు కధగా కూడా భావించారు. కానీ ఇపుడు షర్మిల తాను స్వయంగా జగన్ సొంత చానల్ సాక్షి టీవీ ప్రతినిధులను పక్కకు పెట్టడంతో ఆమెకు జగన్ మీద ఎంత కోపం ఉందో బయటపడుతోంది.

షర్మిల కూడా జగన్ లాగానే పట్టుదల కలిగిన నేత. ఆమె జగన్ కోసం వైసీపీ కోసం చాలానే చేశారు. అయితే వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక ఆమెకు ప్రాధ్యాన్యత ఏమీ లేకుండా పోయింది.కనీసం రాజ్యసభ సీటు కూడా దక్కలేదు మరి జగన్ ఎందుకు ఆమెను దూరం పెట్టారు అన్నది ఎవరికీ అర్ధం కాదు కానీ వైసీపీలో ఆమె రెండవ అధికార కేంద్రం అవుతారు అన్న ఆలోచనతోనే అలా చేశారు అన్న విశ్లేషణ కూడా ఉంది.

మొత్తానికి షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి తేల్చుకుంటాను అంటున్నారు. కానీ ఆమె అక్కడితో ఆగుతారా అన్నది పెద్ద ప్రశ్న. పైగా రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉన్నా కూడా నిన్నటిదాకా ఒక్కటే. అక్కడ రాజకీయ ప్రకంపనలు రేగితే అది ఏపీలోనూ రాజుకుంటుంది.ఇక జగన్ కి వ్యతిరేకంగా ఉన్న వారంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా షర్మిలను ఫోకస్  చేస్తోంది.

షర్మిల అంటే అభిమానంతో కాదు, ఆమె వల్ల ఏపీలో జగన్ ని దెబ్బ తీయాలని, షర్మిల కూడా ఆ మీడియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అంటున్నారు. మరి రాజకీయాల్లో ఇలాంటివి మామూలు అనుకున్నా షర్మిల వేస్తున్న ఈ అడుగులు ఏపీలో జగన్ కి ఇబ్బంది కలిగిస్తాయి అంటున్నారు. షర్మిలతో జగన్ కి వ్యతిరేకంగా కనీసం ఒక్క మాట అయినా మాట్లాడించాలి అనుకుంటున్న అనుకూల మీడియాకు ఆమె కనుక అవకాశం ఇస్తే ఇక జగన్ పూర్తిగా కార్నర్ అయినట్లే. మొత్తానికి ఇది జగన్ చేజేతులా చేసుకున్నారో లేక షర్మిల వినకుండా దూకుడు చేస్తున్నారో తెలియదు కానీ వైఎస్సార్ కుటుంబ గొడవలు ఇపుడు చిలికి చిలికి గాలి వానగా మారి ఏపీలో వైసీపీ కొంప ముంచేలా ఉన్నాయని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవర్ స్టార్ కరోనా టెస్ట్ రిజల్ట్ వచ్చేసింది..!

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>