PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1930c012e1-0f5b-440d-a140-3151fd56e2eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1930c012e1-0f5b-440d-a140-3151fd56e2eb-415x250-IndiaHerald.jpgనిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. చిన్న గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులుcovid19;ktr;vennela;mohandas karamchand gandhi;minister;kamareddy;sircilla;mancherial;jagtial;panjaaతెలంగాణలో కిట్స్, బెడ్స్ కొరత!తెలంగాణలో కిట్స్, బెడ్స్ కొరత!covid19;ktr;vennela;mohandas karamchand gandhi;minister;kamareddy;sircilla;mancherial;jagtial;panjaaFri, 16 Apr 2021 20:00:26 GMTతెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం 3 వేల 8 వందలకు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే జిల్లాల నుంచి వస్తున్న లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. సర్కార్ చెబుతున్న కేసుల కంటే  రెండు, మూడు రెట్లు ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని తెలుస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా వైరస్ విస్తరిస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి వైరస్ సోకుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. చిన్న గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు..ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులు, మాక్లూర్, వెల్మల్, వెన్నెల (కే), సావేల్ గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రజలే స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు.

తెలంగాణలోని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. రోగుల తాకిడి పెరగడంతో గాంధీ ఆస్పత్రి ని శనివారం నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.  OPని నిలిపివేయనున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి కేవలం కోవిడ్ హాస్పిటల్ గా మార్చనున్నారు. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులు మాత్రమే ట్రీట్మెంట్ చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. గాంధీలో ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు. గురువారం  ఒక్కరోజే 150మంది అడ్మిట్ అయ్యారు. 10 నిమిషాలకు ఒక పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. గాంధీలోని IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది.

ఇక తెలంగాణలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. టెస్టుల కోసం జనాలు భారీగా వస్తుండటంతో కిట్లు లభించడం లేదు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో కరోనా టెస్ట్ కిట్స్ లేక పరీక్షలు నిలిపివేశారు. టెస్ట్ కిట్స్ అయిపోవడంతో టెస్ట్ లు చేసుకోకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు జనాలు. రెండు రోజుల కు సరిపడా 3000 వేళా కరోనా టెస్ట్ కిట్స్ తెప్పించారు వైద్య అధికారులు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎట్టకేలకు తన 8 ఏళ్ల ఇండస్ట్రీ రికార్డును వకీల్ సాబ్ తో బ్రేక్ చేసుకున్న పవన్ కళ్యాణ్....

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>