MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swarna-charan-discussion08aa87f8-80ef-44a6-b35b-1b23393c3284-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swarna-charan-discussion08aa87f8-80ef-44a6-b35b-1b23393c3284-415x250-IndiaHerald.jpgస్టార్ వారసులకు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఈజీ గానే దొరుకుతుంది.. కానీ ఇక్కడ పోటీలో పరుగులు తీస్తూ నిలదొక్కుకోవడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే అది వారి స్వయంకృషి, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదు.. టాలెంట్ ఇక్కడ ప్రధాన అంశం. అలా తన సొంత ప్రతిభతో మెగా పవర్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్ తేజ్. SWARNA-CHARAN-DISCUSSION;ram charan teja;pawan kalyan;ram pothineni;tara;cinema;interview;industry;yuva;v;paruguరామ్ చరణ్ గురించి లేడీ కొరియోగ్రాఫర్ చెప్పిన విషయాలు వింటే షాక్...!రామ్ చరణ్ గురించి లేడీ కొరియోగ్రాఫర్ చెప్పిన విషయాలు వింటే షాక్...!SWARNA-CHARAN-DISCUSSION;ram charan teja;pawan kalyan;ram pothineni;tara;cinema;interview;industry;yuva;v;paruguFri, 16 Apr 2021 12:30:00 GMTస్టార్ వారసులకు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఈజీ గానే దొరుకుతుంది.. కానీ ఇక్కడ పోటీలో పరుగులు తీస్తూ నిలదొక్కుకోవడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే అది వారి స్వయంకృషి, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదు.. టాలెంట్ ఇక్కడ ప్రధాన అంశం. అలా తన సొంత ప్రతిభతో మెగా పవర్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్ తేజ్. మెగా ఇంటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన స్వయంకృషితో అగ్రహీరో స్థాయికి చేరుకున్నాడు ఈ యువ కథానాయకుడు. సినిమా సినిమాకి తనలోని కొత్తదనాన్ని చూపిస్తూ అభిమానుల స్థాయిని అంతకంతకూ పెంచుకున్నాడు. అంతేకాదు ఇండస్ట్రీ లో రామ్ చరణ్ కు చాలా మంచి పేరు ఉంది.

ఇతను స్టార్ కిడ్ అయినప్పటికీ... సెట్లోకి అడుగు పెట్టినప్పటి నుండి... వెళ్లే వరకు కూడా ఓ సాధారణ నటుడిగానే అందరితో మెలుగుతారని, షూటింగ్ సమయంలో అందరితో చాలా సరదాగా ఉంటారని, ఎదుట ఉన్నది ఎవరైనా సరే గౌరవం ఇచ్చి మాట్లాడతారని, ఎక్కువ తక్కువ అన్న బేధాలు లేకుండా ...అందరితో పాటే ఓ సామాన్య వ్యక్తిలా కలసి పోతాడని, ఇలా చాలామంది రామ్ చరణ్ ని పొగుడుతూనే  ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా కొరియోగ్రాఫర్ స్వర్ణ  రామ్ చరణ్ గురించి మాట్లాడడం రామ్ చరణ్  ఖ్యాతిని మరింత పెంచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె చరణ్ గురించి ఏమన్నారంటే.. రామ్ చరణ్  ఎప్పుడూ కూడా ఓ స్టార్ కిడ్ అనే ప్రత్యేక భావాన్ని కనబర్చలేదు. అతడు ఎప్పుడూ  సెట్ లో ఇతరులకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. సెట్ లోని ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి మాట్లాడతారు. ఎక్కువ తక్కువ అన్న భేదాలు చూపరు. ఏ ఒక్కరినీ కూడా చిన్న చూపు చూడకుండా గౌరవంగా మాట్లాడటం నేను గమనించాను అంది. చరణ్ లో అహంకారం అన్నది అసలు ఎక్కడా లేదు. అలా అసలు అతను ఏ సమయంలోనూ ప్రవర్తించాడు. ఎదుటివారు నిలబడి మాట్లాడితే.. చరణ్ కూడా నిలబడే మాట్లాడుతారు.  ఈయన ఒక హీరోలా కాకుండా ఒక నటుడిలా అందరితో కలిసిపోతారు.పెద్ద స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చాము అన్న అభిప్రాయం లేకుండా అందరితో కలిసిపోయే చాలా అరుదైన వ్యక్తులలో రామ్ చరణ్ ఒకరు.. అంటూ చెర్రీ గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ, ప్రశంసలతో ముంచెత్తారు కొరియోగ్రాఫర్ స్వర్ణ.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతి కేసులో విస్తుపోయే నిజాలు.. !

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!

ఇలా అయితే థియేటర్స్ నడపడం మా వల్ల కాదు.. !!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>