PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila5050c8f4-4779-4707-a31b-87aa0ac31cc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila5050c8f4-4779-4707-a31b-87aa0ac31cc9-415x250-IndiaHerald.jpgరెండూ వేరు వేరు వార్తలు అయినా ఇప్పుడు ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రెండు వార్తలు పోలుస్తూ కొంతమంది ది షర్మిలను ప్రశ్నిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. విషయం ఏమిటంటే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారికి వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని వైఎస్ షర్మిల ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. నిజానికి ఆమె మూడు రోజుల పాటు ఈ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కానీ పోలీసులు ఆమెకు ఒక్క రోజు అది కూడా సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చారు. ఆమె దీక్ష అనంతరం అక్కడి నుంచి లsharmila deeksha;kumaar;anil music;prema;tiru;andhra pradesh;telangana;police;love;minister;police station;traffic police;ycp;anil kumar singhalనిరుద్యోగుల సమస్యల మీద షర్మిల దీక్ష..ఏపీలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం !నిరుద్యోగుల సమస్యల మీద షర్మిల దీక్ష..ఏపీలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం !sharmila deeksha;kumaar;anil music;prema;tiru;andhra pradesh;telangana;police;love;minister;police station;traffic police;ycp;anil kumar singhalFri, 16 Apr 2021 15:00:00 GMTరెండూ వేరు వేరు వార్తలు అయినా ఇప్పుడు ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రెండు వార్తలు పోలుస్తూ కొంతమంది ది షర్మిలను ప్రశ్నిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. విషయం ఏమిటంటే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారికి వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని వైఎస్ షర్మిల ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. నిజానికి ఆమె మూడు రోజుల పాటు ఈ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కానీ పోలీసులు ఆమెకు ఒక్క రోజు అది కూడా సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చారు. ఆమె దీక్ష అనంతరం అక్కడి నుంచి లేచి లోటస్ పాండ్ వరకు పాదయాత్రగా బయలుదేరారు. 

ఆమె వెంట పెద్ద ఎత్తున జనం రావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కాసేపు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడి నుంచి తీసుకెళ్లి లోటస్ పాండ్ లో దింపి వచ్చారు. ఆమె లోటస్ పాండ్లో సైతం ఈ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే నిరుద్యోగ సమస్య కోసం అంటున్న ఆమెను పోలీసులు అరెస్టు చేసే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక నిరుద్యోగి సాక్షాత్తూ ఒక మంత్రి, స్పీకర్ సమక్షంలో ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు సన్మానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సన్మానం చేస్తున్న ఒక సభలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి సంచలనం రేపాడు. అనిల్ కుమార్ అనే యువకుడు తాను గతంలో ఆముదాలవలస మున్సిపాలిటీ లో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్గా పనిచేశానని వైసీపీ ప్రభుత్వం వచ్చాక తనను కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని ఈ విషయం మీద తాను స్పీకర్ చుట్టూ చాలా రోజులుగా తిరుగుతున్నానని చెప్పుకొచ్చాడు. స్పీకర్ కొడుకు కూడా తనby చాలా రోజులు తిప్పించుకుని ఏమాత్రం హెల్ప్ చేయడం లేదని చెబుతూ మంత్రి, స్పీకర్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నం చేశాడు. 

అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వెంట తెచ్చుకున్న బెడ్ తో తన చాతి మీద, మెడ మీద కోసుకునేందుకు ప్రయత్నించాడు. నిజానికి రెండు వార్తలు వేరు వేరు అయినా సరే ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల కోసం కొట్లాడే షర్మిల తన అన్నతో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం ఎందుకు కొట్లాడదు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. తెలంగాణ మీద ఇప్పుడు ఎందుకు ఇంత వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చిందో తెలపాలని కూడా తెలంగాణ వాదులు సైతం ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఘటన జరగడం షర్మిలకు కాస్త ఇబ్బందికరమైన అంశమనే చెప్పాలి.

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శంకర్-చెర్రీ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఆమెకు లక్కు మామూలుగా లేదుగా..?

సినిమాలో చాన్సు కోసం ఈ యాంకర్ ఏంటి ఇలా చేసింది...?

తిరుపతిలో జనసేన తప్పు చేసిందా...?

షర్మిలకు హెల్ప్ చేస్తున్న మాజీ ఎంపీ...?

స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?

లాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>