MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-0d83c817-fd91-44a0-9e41-80c55465abfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-0d83c817-fd91-44a0-9e41-80c55465abfb-415x250-IndiaHerald.jpgకోలీవుడ్‌కి చెందిన వర్ధమాన నటి రాధ పోలీసులను ఆశ్రయించారు. ఓ పోలీసు అధికారి తనను నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సదరు పోలీసు అధికారిపై చీటింగ్ కేసు పెట్టింది. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. సుందరం ట్రావెల్స్‌ చిత్రంలో కథానాయకీగా తమిళ సినీ రంగానికి రాధ(38) పరిచయం అయ్యారు.actress;tiru;cinema;police;tamil;marriage;wife;aadhar;chitramపెళ్లి.. మోసం.. పోలీసులను ఆశ్రయించిన నటి.. ఏమైదంటే..!పెళ్లి.. మోసం.. పోలీసులను ఆశ్రయించిన నటి.. ఏమైదంటే..!actress;tiru;cinema;police;tamil;marriage;wife;aadhar;chitramFri, 16 Apr 2021 21:00:00 GMTకోలీవుడ్‌కి చెందిన వర్ధమాన నటి రాధ పోలీసులను ఆశ్రయించారు. ఓ పోలీసు అధికారి తనను నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సదరు పోలీసు అధికారిపై చీటింగ్ కేసు పెట్టింది. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. సుందరం ట్రావెల్స్‌ చిత్రంలో కథానాయకీగా తమిళ సినీ రంగానికి రాధ(38) పరిచయం అయ్యారు. రాధ గురువారం విరుగ్గం బాక్కం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ వసంత్‌ రాజ్‌పై ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది.

అయితే భర్తతో విడాకుల అనంతరం తల్లి, కుమారుడితో కలిసి శాలిగ్రామంలోని లోకయ్య వీధిలో రాధ నివాసం ఉంటున్నది. ఆర్‌కేపురం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న తిరువాన్మియూరు ఎస్‌ఐ వసంత్‌ రాజ్‌తో గతంలో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంలో పరిచయం ఏర్పడింది. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా,  వసంత్‌రాజ్‌ అధిక సమయం రాధకు కేటాయిస్తూ వచ్చాడు. ఈ వ్యవహారం పసిగట్టి తిరువాన్మీయూరు సీఐకు వసంత్‌ రాజ్‌ భార్య గతంలో ఫిర్యాదు కూడా చేశారు.

ఇక నిండా మునిగినోడికి చలి ఏమిటి అన్నట్టుగా ఇక పూర్తిగా రాధా మోజులో ఈ ఎస్‌ఐ పడ్డాడు. తర్వాత రాధ కోసం తిరువాన్మీయూరు నుంచి వడపళని పోలీసుస్టేషన్‌కు పోస్టింగ్‌ కూడా మార్చుకున్నాడు. ఈ సమయంలో రాధను రహస్యంగా పెళ్లి కూడా చేసుకుని జీవితాన్ని సాగిస్తూ వచ్చినట్టు సమాచారం అసలు కథ ఇక్కడే.. రాధ చేసిన ఓ చిన్న పొరబాటు వసంత్‌రాజ్‌ను అప్రమత్తం చేసింది. తనకు తెలియకుండా, తనతో సంప్రదించకుండా ఆధార్‌ కార్డు, ఇతర గుర్తింపు కార్డులో రాధా తన పేరును భర్తగా చూపించడం, ఆమె కుమారుడికి తండ్రిగా తన పేరు నమోదు చేసి ఉండడాన్ని వసంత్‌ రాజ్‌ గుర్తించాడు.

దీంతో కథ బెడిసి కొట్టింది. ఆమెకు దూరంగా ఉండాలని ఎన్నూరుకు పోస్టింగ్‌ మార్చుకున్నాడు. పోలీసుస్టేషన్‌ వద్దకే వెళ్లి గొడవ కూడా పడ్డట్టు సమాచారం. పోలీసు కావడంతో తన దైన స్టైల్లో బెదిరింపులు ఇవ్వడంతో ఆందోళనతో రాధా పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కింది.  తీగ లాగితే మోసాలు కూడా వెలుగులోకి రావడం గమనార్హం. విరుగ్గంబాక్కం పోలీసుల విచారణలో తనను మోసం చేశారంటూ రాధ  ఇప్పటికే రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్టు వెలుగు చూసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తన తదుపరి సినిమా ఎవరితో చెయ్యాలో క్లారిటీ లేక త్రివిక్రమ్ ఫుల్ డిస్టర్బ్ గా వున్నాడట....

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>