MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vivek-b322edc4-794a-4b57-acb2-c88c0db36b6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vivek-b322edc4-794a-4b57-acb2-c88c0db36b6b-415x250-IndiaHerald.jpgపలు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు వివేక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దాంతో వివేక్ ని చెన్నైలోని వడపళని సిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనను పరిశీలించిన వైద్యులు.. కార్డియాక్ అరెస్ట్‌తో వేదన చెందుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందట. వెంటిలేటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు సిమ్స్ వైద్యులు తెలిపారు. అలాగే వివేక్‌కు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్న Vivek;deva;raghu;raghuvaran;rakshita;vivek;bari;cinema;media;tamil;heart;comedy;heart attack;chatrapathi shivaji;sivaji;fidaaతమిళ నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్... పరిస్థితి విషమం..!!!తమిళ నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్... పరిస్థితి విషమం..!!!Vivek;deva;raghu;raghuvaran;rakshita;vivek;bari;cinema;media;tamil;heart;comedy;heart attack;chatrapathi shivaji;sivaji;fidaaFri, 16 Apr 2021 13:55:00 GMTపలు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు వివేక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దాంతో వివేక్ ని చెన్నైలోని వడపళని సిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనను పరిశీలించిన వైద్యులు.. కార్డియాక్ అరెస్ట్‌తో వేదన చెందుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందట. వెంటిలేటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు సిమ్స్ వైద్యులు తెలిపారు. అలాగే వివేక్‌కు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్న అభిమానులు.. తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయనకు ఏమీ కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.అలాగే సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా వివేక్ కి ఏమి కాకూడని కోరుకుంటున్నారు.


ఇక వివేక్ వయసు 59 సంవత్సరాలు.గురువారం నాడు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. అనంతరం క్షేమంగా బయటకు వచ్చిన వివేక్.. కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. 'కరోనా బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం. టీకా వేసుకోవడం' ముఖ్యం అని ప్రకటించారు. ఇంటి చిట్కాలు ఎన్ని పాటించినా.. టీకా మాత్రమే కరోనా నుంచి కాపాడుతుందని అన్నారు. 'వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకదా? అని మీరు నన్ను అడుగొచ్చు. అయితే, టీకా తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదు. అందుకే కరోనా టీకా తీసుకోండి' అని వివేక్ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే వివేక్.. తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోడాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ఇంతలోనే ఆయనకు హార్ట్ అటాక్ రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.ఇక వివేక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగా ఎన్నో సినిమాలో ఆయన ఎంతగానో ఆకట్టుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా వివేక్ సుపరిచితుడే. అపరిచితుడు, శివాజీ, రఘువరన్ బీటెక్ వంటి పలు సినిమాలలో వివేక్ నటనకి ఆయన కామెడీ టైమింగ్ కి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఆయన ఆరోగ్యవంతుడై క్షేమంగా వుండాలని కోరుకుందాం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలకు హెల్ప్ చేస్తున్న మాజీ ఎంపీ...?

స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?

లాక్‌డౌన్ బెట్టింగ్‌.. ఇదో విచిత్ర‌మైన ఆట‌!

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!

ఇలా అయితే థియేటర్స్ నడపడం మా వల్ల కాదు.. !!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>