MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas89476038-68d9-4917-881d-d75b225ea4b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas89476038-68d9-4917-881d-d75b225ea4b7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రముఖ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ముందుగా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలు వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు దీనిని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. రెట్రో లవ్ స్టోరీ డ్రామా మూవీగా ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ అంశాలు కలగలిపి దర్శకుడు రాధాకృష్ణprabhas;prabhas;amitabh bachchan;hrithik roshan;pooja hegde;siddharth;siddharth anand;tiger shroff;anand malayalam actor;deepika;krishnam raju;naga;prasanth;prashanth neel;roshan;vyjayanthi;india;andhra pradesh;bollywood;tollywood;cinema;naga aswin;love;director;war;heroine;prasanth neel;lie;vemuri radhakrishna;anand deverakonda;v;prashant kishor;love storyబాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ కన్ఫర్మ్ ..... ??బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ కన్ఫర్మ్ ..... ??prabhas;prabhas;amitabh bachchan;hrithik roshan;pooja hegde;siddharth;siddharth anand;tiger shroff;anand malayalam actor;deepika;krishnam raju;naga;prasanth;prashanth neel;roshan;vyjayanthi;india;andhra pradesh;bollywood;tollywood;cinema;naga aswin;love;director;war;heroine;prasanth neel;lie;vemuri radhakrishna;anand deverakonda;v;prashant kishor;love storyFri, 16 Apr 2021 23:32:41 GMTటాలీవుడ్ ప్రముఖ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ముందుగా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలు వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు దీనిని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. రెట్రో లవ్ స్టోరీ డ్రామా మూవీగా ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ అంశాలు కలగలిపి దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్. దీనిని జూలై 30వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా విషయానికి వస్తే హోంబలె ఫిలింస్ వారు రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దానిని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నారు. అయితే ఈ మూడు సినిమాల తర్వాత నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రతిష్టాత్మక మూవీ లో కూడా ప్రభాస్ నటించనున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ నాలుగు సినిమాల తర్వాత ప్రభాస్ ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని అంటున్నారు.

రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా ప్రభాస్ ని ఆయన స్వగృహంలో కలిసిన సిద్ధార్థ్ ఆనంద్ ఒక అద్భుతమైన యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ ని వినిపించారని అది ఎంతో నచ్చిన ప్రభాస్ దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయండి వీలైనంత త్వరలో సినిమా చేద్దాం అని మాటిచ్చారని టాక్. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ ల తో కలిసి వార్ మూవీ తీశారు. భారీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ తో సిద్దార్థ్ చేయనున్న సినిమా కనుక కన్ఫర్మ్ అయితే బాలీవుడ్ లో ప్రభాస్ కి మరింత భారీ క్రేజ్ దక్కే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తపై అధికారికంగా న్యూస్ మాత్రం బయటకు రావాల్సి ఉంది......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కినేని కోడలు చందన రూపం వెనుక అసలు కథ ఇదేనా?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>