PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-66dd120c-f71a-4892-890e-e58b3bb6d6ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-66dd120c-f71a-4892-890e-e58b3bb6d6ac-415x250-IndiaHerald.jpgజగన్ కి హైదరాబాద్ ఇపుడు బహు దూరంగా మారింది. ఆయన తాడేపల్లి లో బ్రహ్మాండమైన ఇంద్ర భవనమే కట్టుకున్నారు కానీ ఆయన అపుడపుడు హైదరాబాద్ కూడా వెళ్తూ వచ్చేవారు. కానీ ఇపుడు అక్కడ ఖాళీ లేదు. తన రాజకీయ భవిష్యత్తు కోసం వైస్సార్ ముద్దుల తనయ, జగన్ సోదరి షర్మిల అక్కడ రాజకీయ పోరాటం చేస్తున్నారు. sharmila;kcr;indra;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;media;y s vivekananda reddy;minister;doctor;murder.;tadepalli;sakshi;dookuduషర్మిల దూకుడుతో ఇబ్బందేనా...?షర్మిల దూకుడుతో ఇబ్బందేనా...?sharmila;kcr;indra;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;media;y s vivekananda reddy;minister;doctor;murder.;tadepalli;sakshi;dookuduFri, 16 Apr 2021 21:21:40 GMTజగన్ కి హైదరాబాద్ ఇపుడు బహు దూరంగా మారింది. ఆయన తాడేపల్లి లో బ్రహ్మాండమైన ఇంద్ర భవనమే కట్టుకున్నారు కానీ ఆయన అపుడపుడు హైదరాబాద్ కూడా వెళ్తూ వచ్చేవారు. కానీ ఇపుడు అక్కడ ఖాళీ లేదు. తన రాజకీయ భవిష్యత్తు కోసం వైస్సార్ ముద్దుల తనయ, జగన్ సోదరి షర్మిల అక్కడ రాజకీయ పోరాటం చేస్తున్నారు.

ఆమె తెలంగాణా సర్కార్ మీద పోరాటం చేస్తున్న సమయం దొరికితే చాలు ఏపీ సీఎం అయిన తన సొంత అన్న గారి మీద కూడా కారాలు మిరియాలూ నూరుతున్నారు. సాక్షి మీడియా తనకు యాంటీ అని చెప్పడం ద్వారా తాను అన్న రాజకీయానికి యాంటీ అని కూడా షర్మిల  చెప్పేశారు. ఇక షర్మిలది ఒంటరి పోరుగా మారుతోంది. అక్కడ బలమైన ముఖ్యమంత్రిగా కేసీయార్ ఉన్నాడు.

ఆయన్ని ఢీ కొట్టి రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అలసిపోయాయి. ఇపుడు షర్మిల కేవలం వైఎస్సార్ చరిష్మాను ఆధారం చేసుకుని పోరాడడం అంటే కొండకు వెంట్రుకను పట్టి లాగడమే అన్న రాజకీయ  విశ్లేషణలు ఉన్నాయి. అయితే షర్మిల విషయంలో తెలంగాణా సమాజం ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ ఆమె తెలంగాణాలో పోరాటం చేస్తున్నా ఆ ప్రకంపనలు  ఏపీ మీదనే గట్టిగా పడతాయి అని కూడా అంటున్నారు.

ఇక మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు విషయంలో నిజాలు బయటకు తీయాలని కోరుతున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిల దీక్షా శిబిరం వద్ద కనిపించడం చూసిన వారు ఇంతులు ఇద్దరూ జగన్ ఇంటి వద్దనే ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా అన్న చర్చను లేవదీస్తున్నారు. తెలంగాణాలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్నా ఆ ప్రభావం కచ్చితంగా  ఏపీ మీద ఉంటుంది. రేపటి రోజున అది ఏ రూపం తీసుకుంటుంది అన్న చర్చ అయితే గట్టిగానే సాగుతోంది. మొత్తానికి జగన్ కి తన సొంత ఇల్లు లోటస్ పాండ్ నుంచే పోరు మొదలు అయిందని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>