PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-electioncb94b4c9-9cc0-49c4-acef-ec30c57e0e99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-electioncb94b4c9-9cc0-49c4-acef-ec30c57e0e99-415x250-IndiaHerald.jpg ప్రచార గడువు ముగిసినా జోరుగా ప్రలోబాలు కొనసాగుతున్నాయి. మద్యం, మందు జోరుగా పంపిణి చేస్తున్నారు. ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్, కాంగ్రెస్ నుంచి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రవి నాయక్ బరిలో ఉన్నారుnagarjuna sagar by election;nagarjuna akkineni;ravi anchor;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;district;police;nalgonda;assembly;mla;traffic police;janareddy;central government;nayakసాగర్ సమరానికి రెడీ.. గెలుపెవరిదో..సాగర్ సమరానికి రెడీ.. గెలుపెవరిదో..nagarjuna sagar by election;nagarjuna akkineni;ravi anchor;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;district;police;nalgonda;assembly;mla;traffic police;janareddy;central government;nayakFri, 16 Apr 2021 20:20:11 GMTతెలంగాణలో రాజకీయ కాక రేపిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమరానికి సర్వం సిద్దమైంది. ఎన్నికను సవాల్ గా తీసుకున్న ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ప్రచార గడువు ముగిసినా జోరుగా ప్రలోబాలు కొనసాగుతున్నాయి. మద్యం, మందు జోరుగా పంపిణి చేస్తున్నారు. ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్, కాంగ్రెస్ నుంచి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రవి నాయక్ బరిలో ఉన్నారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి.  నియోజకవర్గ పరిధిలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో  108 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం 15 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ సరళిపై వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు.

సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రతతో పాటు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 4,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా 3000 మంది సివిల్ పోలీసులు, వెయ్యికి పైగా పారా మిలటరీ పోలీసులు భద్రతతో భాగస్వామ్యం కానున్నారు. ఇందులో జిల్లా ఎస్పీ - 1, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ, 5 గురు అదనపు ఎస్పీలు, ఎస్పీలు, 14 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, 180 మంది ఎస్.ఐ.లు, 2,750 మంది సివిల్ పోలీస్ సిబ్బంది, 270 మంది కేంద్ర బలగాలు, మరో 270 మంది తెలంగాణ ప్రత్యేక పోలీసులు, వెయ్యికి పైగా ప్రత్యేక బృందాలతో కూడిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు.

శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇప్పటికే సీఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.పోలింగ్ ముగిసే వరకు డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ లాంటి అంశాలపై తనిఖీల కోసంప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాగర్ లో ఇప్పటి వరకు 50 లక్షల రూపాయల నగదు, 45 లక్షల రూపాయల మద్యం సీజ్ చేయడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద 190 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల దూకుడుతో ఇబ్బందేనా...?

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>