MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akiranandan-habits-disclosedca1862f9-074a-4c23-9815-cff3fc751136-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akiranandan-habits-disclosedca1862f9-074a-4c23-9815-cff3fc751136-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఈసారి తన కూతురు ఆద్య తో కలిసి ఇన్ స్టా గ్రామ్ లైవ్ లోకి వచ్చి ఛాట్ చేయడంతో అనేకమంది నెటిజన్స్ ఈ లైవ్ ఛాట్ లో పాల్గొని రేణు దేశాయ్ కి సంబంధించిన వ్యక్తిగత వృత్తిపరమైన విషయాల గురించి ఆమె పిల్లలకు సంబంధించి విషయాల గురించి అనేక ప్రశ్నలు అడగడమే కాకుండా ఆమె వద్ద నుండి అనేక సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా అనేక మంది అడిగిన పలు ప్రశ్నలకు కూతురుతో కలిసి రేణు దేశాయ్ సరదాగా సమాధానాలు ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తrenudesai;;pawan;kalyan;renu desai;netizens;media;ishtam;akira nandhanఅకిరా నందన్ వ్యక్తిగత అలవాట్లను బయటపెట్టిన రేణు దేశాయ్ !అకిరా నందన్ వ్యక్తిగత అలవాట్లను బయటపెట్టిన రేణు దేశాయ్ !renudesai;;pawan;kalyan;renu desai;netizens;media;ishtam;akira nandhanFri, 16 Apr 2021 09:00:00 GMTగత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రేణు దేశాయ్  ఈసారి తన కూతురు ఆద్య తో కలిసి ఇన్ స్టా గ్రామ్ లైవ్ లోకి వచ్చి ఛాట్ చేయడంతో అనేకమంది నెటిజన్స్ ఈ లైవ్ ఛాట్ లో పాల్గొని రేణు దేశాయ్   కి సంబంధించిన వ్యక్తిగత వృత్తిపరమైన  విషయాల గురించి ఆమె పిల్లలకు సంబంధించి విషయాల గురించి  అనేక ప్రశ్నలు అడగడమే కాకుండా ఆమె వద్ద నుండి అనేక సమాధానాలు రాబట్టారు.  


ఈ సందర్భంగా అనేక మంది అడిగిన పలు ప్రశ్నలకు కూతురుతో కలిసి రేణు దేశాయ్ సరదాగా సమాధానాలు ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండమంటూ అందరికి ఆమె సలహాలు ఇచ్చింది. ఈ లైవ్ చిట్ చాట్ జరిగిన సమయం అంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ ఛాట్ ను చాలమంది నెటిజన్ లు  ఎంజాయ్ చేసారు.  


ఇదే సందర్భంలో ఒక అభిమాని అకిరా నందన్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అకిరాకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కాని అవన్నీ కూడా ప్రైవేట్ గానే ఉంటాయి అని చెపుతూ అవి అతడి స్నేహితులు మాత్రమే వాటిని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది అంటూ అకిరా సోషల్ లైఫ్ గురించి లీకులు ఇచ్చింది.  అంతేకాదు అకీరా కు తన సోషల్ మీడియా అకౌంట్స్ పబ్లిక్ చేయడం ఇష్టంలేదు అంటూ  ఎప్పుడు అకిరా  ప్రైవేట్ జీవితాన్ని మాత్రమే కోరుకుంటాడు కానీ జనంతో కలవడం ఇష్టపడడు అంటూ కామెంట్స్ చేసింది.

   
ఇదే సమయంలో ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటూ అడిగిన ప్రశ్నకు రేణు షాకింగ్ రిప్లై ఇచ్చింది. ‘ఆయన గురించి ఏం మాట్లాడమంటారండి. నా లైవ్ కు వచ్చి కూడా మీరు ఆయన గురించిన మెసేజ్ లు పెడుతున్నారు. సరే అని నేను ఆయన గురించి మాట్లాడితే రేణుకి ఏం పని లేదు. ఎప్పుడు ఆయన గురించే మాట్లాడుతుందంటూ మళ్లీ మీరే తిడతారు. మీరు అడిగారని ఏదో ఒక విషయం మాట్లాడితే నన్ను ట్రోల్ చేస్తారు’ అంటూ రేణు దేశాయ్ ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి చురకలు అంటించింది. ఈ లైవ్ ఛాట్ ఎలా ఉన్న రేణు ఇస్తున్న లీకుల ప్రకారం పవన్ లాగే అకిరా కుడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటాడు అన్న విషయం అందరికి తెలిసిపోయింది..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దుమారం రేపుతున్న అరవింద్ వ్యాఖ్యలు, కేటిఆర్ పై వివాదాస్పద వ్యాఖ్య

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>