PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/abn-andhrajyothi-sharmila-jagan-ycp2e5995db-0a7f-45a3-8aa1-57e3dfae8a6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/abn-andhrajyothi-sharmila-jagan-ycp2e5995db-0a7f-45a3-8aa1-57e3dfae8a6c-415x250-IndiaHerald.jpgఏబీఎన్ – ఆంధ్రజ్యోతికి, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి మ‌ధ్య వైరం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆ మీడియా సంస్థపై వైఎస్ ఉన్నప్పటి నుంచి దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఏబీఎన్ - ఆంధ్ర‌జ్యోతిని పూర్తిగా నిషేధించారు. ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌క‌ట‌న‌ల‌న్నింటినీ నిలిపివేశారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రూ.24 ల‌క్ష‌ల విలువ‌చేసే ప్ర‌క‌ట‌న‌లే ఇచ్చారు. పార్టీ నేత‌లెవ‌రూ ఏబీఎన్ చ‌ర్చాగోష్టిలో పాల్గొన‌డంకానీ, వ్య‌క్తిగ‌త ప్ర‌క‌ట‌న‌లివ్abn;mithra;vijayalakshmi;y. s. rajasekhara reddy;mp;police;media;ycp;sakshi;partyజ‌గ‌న్‌కు సాక్షి... ష‌ర్మిల‌కు ఏబీఎన్‌!!జ‌గ‌న్‌కు సాక్షి... ష‌ర్మిల‌కు ఏబీఎన్‌!!abn;mithra;vijayalakshmi;y. s. rajasekhara reddy;mp;police;media;ycp;sakshi;partyFri, 16 Apr 2021 16:52:00 GMTఏబీఎన్ – ఆంధ్రజ్యోతికి, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి మ‌ధ్య వైరం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆ మీడియా సంస్థపై వైఎస్ ఉన్నప్పటి నుంచి దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఏబీఎన్ - ఆంధ్ర‌జ్యోతిని పూర్తిగా నిషేధించారు. ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌క‌ట‌న‌ల‌న్నింటినీ నిలిపివేశారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రూ.24 ల‌క్ష‌ల విలువ‌చేసే ప్ర‌క‌ట‌న‌లే ఇచ్చారు. పార్టీ నేత‌లెవ‌రూ ఏబీఎన్ చ‌ర్చాగోష్టిలో పాల్గొన‌డంకానీ, వ్య‌క్తిగ‌త ప్ర‌క‌ట‌న‌లివ్వడంకానీ చేస్తే వైసీపీ త‌ర‌ఫున వారికి అదే చివ‌రిరోజు. ఏమీ చెప్ప‌కుండానే.. ఏమీ చేయ‌కుండానే దూరం పెట్టేస్తారు. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎంపీ అయిన కొత్త‌లో ఏబీఎన్‌తో మాట్లాడుతున్నార‌ని, ఆంధ్ర‌జ్యోతికి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నార‌నే ఆయ‌న్ను దూరం పెట్టారు. ఇప్పుడు ఆ ఎంపీనే జ‌గ‌న్‌కు ఏకు మేక‌య్యారు.

సాక్షిని దూరం పెట్టిన ష‌ర్మిల‌
తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ స్థాపించ‌బోతోన్న ష‌ర్మిల‌కు, ఆమె త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి ప్ర‌ధాన మీడియా ఏబీఎన్ - ఆంధ్ర‌జ్యోతినే.  తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిల, విజయలక్ష్మిని ఏబీఎన్ భుజానికెత్తుకుంది. వారు కూడా ఛాన‌ల్‌కు, దిన‌ప‌త్రిక‌కు ప్ర‌త్యేకంగా ఇంటర్యూలు ఇస్తున్నారు. షర్మిల ఉద్యోగ దీక్ష ఎపిసోడ్‌ ఉద్రిక్తంగా సాగింది. ఇతర మీడియాలు సాయంత్రం వరకూ పట్టించుకోకపోయినా, క‌వ‌రేజ్‌పై దృష్టిపెట్ట‌క‌పోయినా ఏబీఎన్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తిస్థాయి క‌వ‌రేజ్ ఇచ్చింది. పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా వార్త‌ను బాగా క‌వ‌ర్ చేశారు.

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులుండ‌రు
షర్మిల జాకెట్ చినిగిపోయిందని..పోలీసులు అతి చేశారంటూ విజయలక్ష్మి స్పందనను, ఇత‌ర నేత‌ల స్పంద‌న‌ను వెంటనే ప్రసారం చేసింది. షర్మిల దీక్షా శిబిరం వద్ద సాక్షిని దూరం పెడుతున్నారు.క‌వ‌రేజీ ఇవ్వ‌న‌ప్పుడు ఇక్క‌డ మీ కెమెరాలు ఎందుకు?  మాకు అడ్డ‌మంటూ ష‌ర్మిల సాక్షి మీడియాపై తీవ్ర‌వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేకెత్తించింది. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు.. శాశ్వ‌త మిత్రులుండ‌రు.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని వ్య‌క్తిగ‌త ప్ర‌త్య‌ర్థులుగా చూడ‌కూడ‌దు. కానీ వైసీపీ నేత‌లు మాత్రం రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని వ్య‌క్తిగ‌త శ‌త్రువులుగా చూస్తున్నారు. ఈ ధోర‌ణి ఎన్నాళ్లు కొన‌సాగిస్తారో ఎవ‌రికీ తెలియ‌కుండా ఉంది. అన్నాచెల్లెళ్లు సాగిస్తున్న స‌మ‌రంపై అనేక సందేహాలు.. ఎన్నో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ ఏబీఎన్‌-ఆంధ్ర‌జ్యోతి మాత్రం త‌న‌కు తెలిసిన స‌మాచారం మేర‌కు త‌న ప‌ని తాను చేసుకుపోతోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదే జరిగితే చంద్రబాబు రోజులే కేసీఆర్ కు...?

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>