PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicse88a08c1-4bcd-4d16-a177-8da78f327ce8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicse88a08c1-4bcd-4d16-a177-8da78f327ce8-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఈనెల 7న తిరుపతిలో నిర్వహించిన మీడియా మసావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోని ప్లే చేశారు దేవినేని. ఆ వీడిap politics;tiru;jagan;vijayawada;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;devineni avinash;kurnool;smart phone;whatsapp;tirupati;media;chief minister;minister;husband;letter;ycp;devineni uma maheswara raoదేవినేని ఉమ నిన్ను వదలా..అంటున్న సీఐడీ !!దేవినేని ఉమ నిన్ను వదలా..అంటున్న సీఐడీ !!ap politics;tiru;jagan;vijayawada;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;devineni avinash;kurnool;smart phone;whatsapp;tirupati;media;chief minister;minister;husband;letter;ycp;devineni uma maheswara raoFri, 16 Apr 2021 08:20:42 GMT ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఈనెల 7న తిరుపతిలో నిర్వహించిన మీడియా మసావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోని ప్లే చేశారు దేవినేని. ఆ వీడియో లో జగన్ తిరుపతి గురించి తక్కువ చేసి మాట్లాడినట్లుగా ఉంది.

అయితే ఆ వీడియో మార్ఫింగ్ చేశారంటూ దేవినేని పై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కు చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన కర్నూలు సీఐడీ అధికారులు దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మార్ఫింగ్ చేసిన వీడియో ను తీసుకొని సీఐడీ వద్ద హాజరు కావాలని నోటీసులో పేర్కొనగా దేవినేని హాజరు కాకపోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అయ్యింది. అయితే తాజాగా మరొకసారి ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈసారి సీఐడీ అధికారులు కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసానికి వెళ్లి ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. కర్నూలులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

 అయితే ఇప్పటికే దేవినేని ఉమా కు పోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని, దాంతో నోటీసులను వాట్సప్ కూడా చేసినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అయితే గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసం వద్ద అంటించిన నోటీసుల్లో పేర్కొన్న కొన్ని అంశాలు కూడా వివాదానికి దారి తీస్తున్నాయి. గురువారం ఉదయం 10.20 గంటలకు గొల్లపూడిలోని దేవినేని నివాసానికి నోటీసులు అంటించిన అధికారులు..ఉదయం 10.30 గంటలకు కర్నూలు రావాలని నోటీసుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఇక ఇలా మార్ఫింగ్ చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ వ్యవహారం అంతా గమనిస్తే దేవినేని ఉమా ను సీఐడీ వదిలేటట్లుగా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నల్గొండలో దారుణం..యూట్యూబ్ లో పూజలు చూసి బిడ్డను బలిచ్చినతల్లి..!

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>