MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/powerstarku-tarak-prashamshalua08d3bd0-9470-49ee-9663-a1fbb09fcf41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/powerstarku-tarak-prashamshalua08d3bd0-9470-49ee-9663-a1fbb09fcf41-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ఏ ప్ర‌ముఖ‌ హీరో సినిమా విజ‌య‌వంత‌మైనా మిగిలిన హీరోలు ఆ చిత్ర క‌థానాయ‌కుడిని, చిత్ర బృందాన్ని మ‌న‌స్పూర్తిగా అభినందించే మంచి సంప్ర‌దాయం మొద‌టినుంచీ కొన‌సాగుతూ వస్తోంది. తాజాగా ఇంకో స్టార్ హీరో కూడా ‘వకీల్ సాబ్’ బాగా నచ్చేసి ప‌వ‌ర్‌స్టార్‌ను అభినందించాడ‌ట. అతడెవ‌రో తెలుసా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. తార‌క్ నేరుగా పవన్‌ను కలిసి కౌగిలించుకుని మరీ అభినందనలు తెలిపాడట.pawan kalyan, ntr;pawan;chiranjeevi;mahesh;ntr;prakash raj;jr ntr;krishna;raj;ram madhav;rrr movie;cinema;telugu;rajani kanth;media;king;interview;hero;nandamuri taraka rama rao;research and analysis wing;chitramప‌వ‌ర్‌స్టార్‌కు తార‌క్ ప్ర‌శంస‌లుప‌వ‌ర్‌స్టార్‌కు తార‌క్ ప్ర‌శంస‌లుpawan kalyan, ntr;pawan;chiranjeevi;mahesh;ntr;prakash raj;jr ntr;krishna;raj;ram madhav;rrr movie;cinema;telugu;rajani kanth;media;king;interview;hero;nandamuri taraka rama rao;research and analysis wing;chitramThu, 15 Apr 2021 06:30:00 GMTటాలీవుడ్‌లో ఏ ప్ర‌ముఖ‌ హీరో సినిమా విజ‌య‌వంత‌మైనా మిగిలిన హీరోలు ఆ చిత్ర క‌థానాయ‌కుడిని, చిత్ర బృందాన్ని మ‌న‌స్పూర్తిగా అభినందించే మంచి సంప్ర‌దాయం మొద‌టినుంచీ కొన‌సాగుతూ వస్తోంది. గ‌త త‌రం అగ్ర‌హీరోలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజుల మ‌ధ్య వృత్తిప‌రంగా, వ్య‌క్తిగ‌తంగా ఎంతో మంచి సంబంధాలుండేవి. అందుకే వారి హ‌యాంలో తెలుగులో ప‌లు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఆ త‌రువాత త‌రం హీరోల హ‌యాంలో కొందరి మ‌ధ్య చిన్న‌ చిన్న ఇగో ఇబ్బందులు త‌లెత్తినా అవి ప‌రిమితి దాట‌లేద‌నే చెప్పాలి. అయితే  మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో అభిమానులను స‌మాన స్థాయిలో మెప్పించ‌డం సాధ్యం కాద‌నో, న‌టీన‌టుల‌ రెమ్యూన‌రేష‌న్లు భారీగా పెరిగిపోయిన కార‌ణంగానో తెలియ‌దుగాని, మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చాలా అరుదుగానే తెర‌కెక్కుతున్నాయి. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి స్టార్ హీరోలు తార‌క్‌- రాంచ‌ర‌ణ్ ల‌తో తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో నెల‌కొన్న క్రేజ్ ఇలాంటి చిత్రాల‌పై ప్రేక్ష‌కుల్లో ఏ స్థాయిలో ఆస‌క్తి ఉంటుందో చాటి చెబుతుంది.

ఇక ఇత‌ర హీరోల చిత్రాలు విజ‌య‌వంతం అయిన‌ప్పుడు దానిని స్వాగ‌తిస్తూ అభినందించ‌డంలో మెగాస్టార్ చిరంజీవి ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇదేకోవ‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ కూడా ఏమాత్రం ఇగో చూప‌కుండా ఇత‌ర స్టార్ హీరోలను అభినందించ‌డంలో ముందుంటారు.  గ‌తంలో ఇలా చేయాలన్నా అదో పెద్ద తతంగం లాగా ఉండేది. మీడియాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే అవతలి హీరోను వెళ్లి నేరుగా కలిసి అభినందించాలి. కానీ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఇబ్బంది లేకపోయింది. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే చాలు. సోష‌ల్ మీడియాలో చురుగ్గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తనకు ఏ సినిమా నచ్చినా ఏ భేషజాల్లేకుండా ట్విట్టర్లో పోస్ట్ పెట్టేస్తుంటాడు. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా చూసి మహేష్.. పవన్ మీద, చిత్ర బృందం మీదా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇంకో స్టార్ హీరో కూడా ‘వకీల్ సాబ్’ బాగా నచ్చేసి ప‌వ‌ర్‌స్టార్‌ను అభినందించాడ‌ట. అతడెవ‌రో తెలుసా యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్.  తార‌క్ నేరుగా పవన్‌ను కలిసి కౌగిలించుకుని మరీ అభినందనలు తెలిపాడట. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారని, తారక్ అయితే పవన్‌ను హత్తుకుని అభినందనలు తెలిపాడని వెల్లడించడం విశేషం. మెగా, నందమూరి అభిమానుల మధ్య కాస్త దూరం ఉంద‌న్న అభిప్రాయం సినీ అభిమానుల్లో ఉన్న నేప‌థ్యంలో తారక్ ఇలా పవన్‌‌ను కౌగిలించుకుని అభినందనలు తెలిపాడన్న విష‌యంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసిన‌ బాలయ్య "అఖండ".!

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>