MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/corona-effects-on-movies2c9bd1c7-668a-4207-9cc8-62501f7e799b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/corona-effects-on-movies2c9bd1c7-668a-4207-9cc8-62501f7e799b-415x250-IndiaHerald.jpg క‌రోనా మొదట వేవ్ టెన్షన్ పోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ రీ స్టార్ట్ అయింది. క్రాక్, ఉప్పెన సినిమాలు సూపర్ హిట్ లు కావడం మంచి కలెక్షన్లు రావడంతో టాలీవుడ్ నిర్మాత‌లు త‌మ సినిమాల రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించ‌డానికి ఎలా పోటీ ప‌డ్డారో తెలిసిందే. మునుపెన్న‌డూ లేని విధంగా కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే ప‌దుల సంఖ్య‌లో కొత్త సినిమాల విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించారు దర్శక నిర్మాతలు. ఏకంగా ఏడాది త‌ర్వాతి రావాల్సిన సినిమాల‌కు కూడా ఇప్పుడే కర్చీఫ్ లు వేసుకున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు అసలు నిజానికి అప్పటికి tollywood gossips;tollywood;cinema;krack;narappaకొత్త టెన్షన్ పెట్టిన కరోనా.. మళ్ళీ రిలీజ్ డేట్ ల గొడవ తప్పదు ?కొత్త టెన్షన్ పెట్టిన కరోనా.. మళ్ళీ రిలీజ్ డేట్ ల గొడవ తప్పదు ?tollywood gossips;tollywood;cinema;krack;narappaThu, 15 Apr 2021 17:03:39 GMT

క‌రోనా మొదట వేవ్ టెన్షన్ పోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ రీ స్టార్ట్ అయింది. క్రాక్, ఉప్పెన సినిమాలు సూపర్ హిట్ లు కావడం మంచి కలెక్షన్లు రావడంతో టాలీవుడ్ నిర్మాత‌లు త‌మ సినిమాల రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించ‌డానికి ఎలా పోటీ ప‌డ్డారో తెలిసిందే. మునుపెన్న‌డూ లేని విధంగా కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే ప‌దుల సంఖ్య‌లో కొత్త సినిమాల విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించారు దర్శక నిర్మాతలు. ఏకంగా ఏడాది త‌ర్వాతి రావాల్సిన సినిమాల‌కు కూడా ఇప్పుడే కర్చీఫ్ లు వేసుకున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు


 అసలు నిజానికి అప్పటికి సినిమా చేతికి వస్తుందో లేదో తెలియదు కానీ ముందైతే డేట్లు ఇచ్చేద్దాం అన్న‌ట్లు పోటీ ప‌డ్డారు. క‌ట్ చేస్తే ఇప్పుడు చాలా సినిమాలు అనుకున్న డేటుకు రావ‌డం అన్ని సినిమాలాకి క‌ష్టంగా ఉంది. షూటింగ్ లేట్ కావడానికి తోడు.. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు చాలా సినిమాలు వాయిదా ప‌డ‌టం ఖాయం. ఈ వారం నుంచి ఒక్కో సినిమా వాయిదా ప‌డ‌టం మొద‌లైంది. ఇప్ప‌టికే ల‌వ్ స్టోరి, ట‌క్ జ‌గ‌దీష్‌, విరాట‌ప‌ర్వం ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వాయిదా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాయి. 


ఇక ఇదే దారిలో మరిన్ని సినిమాలు ఇదే బాట ప‌ట్ట‌నున్నాయని అంటున్నారు. క‌రోనా సెకండ్ వేవ్‌ నేపధ్యంలో ఆంక్షల విషయంలో భ‌య‌ప‌డుతున్నారో లేక ఏపీలో టికెట్ల రేట్ల నియంత్ర‌ణ నేప‌థ్యంలో ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేయ‌డం మంచిది కాద‌నుకుంటున్నారో తెలియ‌దు కానీ.. ఈ నెల‌లో రావాల్సిన మూడు క్రేజీ సినిమాలు వాయిదా ప‌ద్దాయి. చిన్న సినిమాలే ఇలా ఉంటే వ‌చ్చే నెల‌లో రావాల్సిన ఆచార్య‌, నారప్ప సినిమాలు కూడా షెడ్యూల్ ప్ర‌కారం రిలీజ్ కావ‌డం సందేహమే. మొత్తం మీద ఈ సినిమాల‌న్నీ డేట్లు మార్చుకుని వెన‌క్కి వెళ్లి ఆంక్షలు పూర్తవగానే ఒక్కసారిగా రిలీజ్ కి సిద్దం అయితే డేట్స్ క్లాష్ త‌ప్పేలా లేదు. చూడాలి మరి ఏమవుతుందో ?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనాపై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!

లోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>