PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-by-elections8385f4d0-a8c5-4605-942e-665937b3db5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-by-elections8385f4d0-a8c5-4605-942e-665937b3db5c-415x250-IndiaHerald.jpgసత్యవేడు సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. కరోనాను నియంత్రణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆయన మండిపడ్డారు. కరోనా రోగులకు వైద్యచికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసారు. ముగ్గురు టిడిపి ఎంపిలు మూడు సింహాలుగా పోరాటం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే జైలుకు వెళతానని జగన్ కు భయం అని అన్నారు. రాష్ట్రంలో 90పరిశ్రమలను తీసుకొచ్చా..వేలాది మంది యువతకు ఉపాదిని కల్పించాం అని చెప్cbn,tdp,ap;ntr;srikanth;tiru;varsha;jagan;police;tirupati;chief minister;history;mla;minister;husband;thief;tdp;ycp;nandamuri taraka rama rao;reddy;dongaకామెడిగా ఉందంటున్న బాబు...!కామెడిగా ఉందంటున్న బాబు...!cbn,tdp,ap;ntr;srikanth;tiru;varsha;jagan;police;tirupati;chief minister;history;mla;minister;husband;thief;tdp;ycp;nandamuri taraka rama rao;reddy;dongaThu, 15 Apr 2021 10:10:00 GMTసత్యవేడు సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. కరోనాను నియంత్రణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆయన మండిపడ్డారు. కరోనా రోగులకు వైద్యచికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసారు. ముగ్గురు టిడిపి ఎంపిలు మూడు సింహాలుగా పోరాటం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే జైలుకు వెళతానని జగన్ కు భయం అని అన్నారు.

రాష్ట్రంలో 90పరిశ్రమలను తీసుకొచ్చా..వేలాది మంది యువతకు ఉపాదిని కల్పించాం అని చెప్పుకొచ్చారు. జగన్ ను చూసి పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అని ఆయన అన్నారు. నమ్ముకున్న వాళ్ళను సిఎం పిడిగుద్దులు గుద్దుతున్నాడు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు రైతుల మెడలకు ఉరితాడు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రాళ్ళ వర్షం.. కరెంట్ కట్ అని మండిపడ్డారు. నా సభలను ఎందుకు అడుగడుగునా అడ్డుకుంటున్నారు..? అని మండిపడ్డారు.

ఉన్మాదుల్లారా ఖబడ్థార్  అంటూ హెచ్చరించారు. సత్యవేడులో ఇసుక దొంగ వ్యాపారమే వైసిపి కార్యకర్తలకు దినచర్య అని, రాళ్ళదాడే జరగలేదని పోలీసులు చెప్పడం  హాస్యాస్పదం అని అన్నారు. దాడి చేసిన నిందితులను నేను పట్టుకొట్టొచ్చి అప్పజెప్పాలా..? అని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పేదల కోసం బతికిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.

ఎపిలో జగన్ వైరస్ ఉంది అని,  భయంకరమైనది అని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి ఇసుకాసురుడు అని ఆయన ఆరోపణలు చేసారు. ఇసుక అక్రమ రవాణాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేసారు. మంత్రి పెద్దిరెడ్డే కాకుండా శ్రీకాంత్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంలు ఇసుక దొంగలు అని విమర్శలు చేసారు. వాలంటీర్ల బెదిరింపులకు భయపడకండి అని సూచించారు. చరిత్ర సృష్టించండి..తిరుపతి ఉపఎన్నికల్లో టిడిపిని భారీ మెజారిటీతో గెలిపించండి అని సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వరంగల్ లో బిజెపి బిగ్ ప్లాన్...!

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>