PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acchennaidu-janasena008da3dd-9229-4f07-b7d5-8eaa198c686a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acchennaidu-janasena008da3dd-9229-4f07-b7d5-8eaa198c686a-415x250-IndiaHerald.jpgటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఒక పార్టీ నాయకుడితో కొనసాగించిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో వెంకట్ రావ్ అనే ఒక రాజకీయ నాయకుడు టీడీపీ ని నమ్ముకొని బజారున పడ్డానని అచ్చెన్నాయుడుతో చెబుతూ వాపోయారు. అయితే అతన్ని సముదాయించే క్రమంలో అచ్చెన్నాయుడు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే మంచిగా ఉంటే టీడీపీ పార్టీకి ఈ పరిస్థితి ఎలా వస్తుంది? అంటూ లోకేష్ అసమర్థుడని చెప్పుకొచ్చారు. దీంతో లోకేష్ తో సహా చంద్రబాబు నాయుడు కూడా ఆయనపై కోపంగా ఉన్నారని తెలుస్తోacchennaidu janasena;pawan;lokesh;pawan kalyan;venkat;nimmakayala china rajappa;jagan;atchannaidu kinjarapu;andhra pradesh;janasena;tdp;ycp;lokesh kanagaraj;janasena party;vangaveeti;vangaveeti radha krishna;vemuri radhakrishna;party;shatru1జనసేన పార్టీలో చేరనున్న అచ్చెన్నాయుడు?జనసేన పార్టీలో చేరనున్న అచ్చెన్నాయుడు?acchennaidu janasena;pawan;lokesh;pawan kalyan;venkat;nimmakayala china rajappa;jagan;atchannaidu kinjarapu;andhra pradesh;janasena;tdp;ycp;lokesh kanagaraj;janasena party;vangaveeti;vangaveeti radha krishna;vemuri radhakrishna;party;shatru1Thu, 15 Apr 2021 10:00:00 GMTటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఒక పార్టీ నాయకుడితో కొనసాగించిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో వెంకట్ రావ్ అనే ఒక రాజకీయ నాయకుడు టీడీపీ ని నమ్ముకొని బజారున పడ్డానని అచ్చెన్నాయుడుతో చెబుతూ వాపోయారు. అయితే అతన్ని సముదాయించే క్రమంలో అచ్చెన్నాయుడు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే మంచిగా ఉంటే టీడీపీ పార్టీకి ఈ పరిస్థితి ఎలా వస్తుంది? అంటూ లోకేష్ అసమర్థుడని చెప్పుకొచ్చారు. దీంతో లోకేష్ తో సహా చంద్రబాబు నాయుడు కూడా ఆయనపై కోపంగా ఉన్నారని తెలుస్తోంది.


అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న టాక్ ప్రకారం.. అచ్చెన్నాయుడు కావాలనే ఆ వీడియోని రికార్డ్ చేయించి లీక్ చేసారని అంటున్నారు. తనకు టీడీపీ లో ఉండటం అసలు ఇష్టం లేదని అందరికీ తెలియజేయడానికే అచ్చెన్నాయుడు ఇలా మాట్లాడరని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 17 తరువాత ఆయన శాశ్వతం గా టీడీపీ పార్టీ ని విడిచిపెట్టానున్నారని టాక్ నడుస్తోంది.



ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు టీడీపీ ని వీడి జనసేన పార్టీ లో జాయిన్ అవుతారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. సొంతంగా పార్టీ పెట్టి ముందుకు నడిపించడం తన వల్ల అయ్యే పని కాదని.. అందుకే వేరే పార్టీలో చేరాలని అచ్చెన్నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన చాలా కాలం పాటు టీడీపీ పార్టీ కి సేవలందించారు కాబట్టి.. దానికి బద్ధ శత్రువైన వైసీపీ పార్టీలో చేరేందుకు అచ్చెన్న ఆసక్తి కనబరచకపోవచ్చు. ఒకవేళ వైసీపీ లో చేరినా ఆయనకు టీడీపీ పార్టీ లో దొరికినంత మర్యాదలు దొరకక పోవచ్చు. ఆయన సీనియర్ రాజకీయవేత్త కాబట్టి సర్దుకుపోవడం వంటివి కుదరవు.



ఈ విషయాలన్నీ బేరీజు వేసుకున్న తర్వాత అచ్చెన్నాయుడు జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నాయకులైన నిమ్మకాయల చిన్న రాజప్ప, వంగవీటి రాధాకృష్ణ కూడా జనసేన పార్టీలోకి జంప్ కాబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి.



"ఏపీ సీఎం జగన్ నాలాంటి సీనియర్ నేతలకు గౌరవం ఇవ్వకపోయినా.. వినయ పూర్వకమైన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాకు ఖచ్చితంగా గౌరవం ఇస్తారు." అని అచ్చెన్న తన సన్నిహితులతో చెప్పినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అచ్చెన్నాయుడు జనసేన పార్టీలో చేరతారని ప్రస్తుతం వస్తున్న రూమర్స్ నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ ఆయన మాత్రం టీడీపీ విడిచి పెట్టడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియా ఒక్క రోజే 2 లక్షల కేసులు, అమెరికా దగ్గరలో భారత్...?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>